ప్రముఖ క్యాబ్ సర్వీస్ కంపెనీ ‘ఉబర్’ ఓ కొత్త ఫీచర్ తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది. ఇప్పటి వరకు క్యాబ్ బుక్ చేసుకోవాలంటే సంస్థ యాప్‌లో ఎంత రేటు చూపిస్తే అంత చెల్లించాల్సి వచ్చేది.. అయితే ఉబర్ పరిచయం చేయనున్న కొత్త ఫీచర్ ‘ఉబర్ ఫ్లెక్స్’లో మనకు నచ్చిన రేటుకే క్యాబ్ ఎంచుకోవచ్చు. ప్రస్తుతం ఈ ఫీచర్ టెస్టింగ్ దశలోనే ఉంది. త్వరలోనే అందుబాటులోకి రానున్నట్లు సమాచారం.
Uber ప్రవేశపెట్టనున్న కొత్త ఫీచర్‌లో వినియోగదారు ప్రయాణించే దూరం, సమయం ఆధారంగా ఒక ధరకు బదులుగా తొమ్మిది ధరలను చూపుతుంది. ఇందులో, వినియోగదారు తనకు నచ్చిన రేటును ఎంచుకోవచ్చు, అయితే ఆ రేటు డ్రైవర్‌కి నచ్చితే యాక్సెప్ట్ చేయొచ్చు, లేదా రిజెక్ట్ చేయొచ్చు..
ఈ ఫీచర్‌తో యూజర్లు తక్కువ ఖర్చుతో ప్రయాణించే సౌలభ్యాన్ని పొందవచ్చు. భారతదేశంలోని ఔరంగాబాద్, అజ్మీర్, బరేలీ, చండీగఢ్, కోయంబత్తూర్, డెహ్రాడూన్, గ్వాలియర్, ఇండోర్, జోధ్‌పూర్ మరియు సూరత్‌లలో ఉబర్ కంపెనీ ఈ ఫీచర్‌ను పరీక్షిస్తున్నట్లు సమాచారం. కంపెనీ ఈ ఫీచర్‌ను భారతదేశంలోనే కాకుండా లాటిన్ అమెరికా మరియు కెన్యాలో కూడా అమలు చేసే అవకాశం ఉంది