ప్రపంచంలోనే అతి పెద్ద కార్ల తయారీ కంపెనీ ఫోక్స్ వ్యాగన్… మరో కొత్త కారును మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. సెడాన్ విభాగంలో ఈ కొత్త కారులను అందుబాటులోకి తీసుకురానుంది. దీని కనీస ధర 11.21 లక్షలు కాగా హైఎండ్ మోడల్ ధర 17.92 లక్షలు. ఆరు వేరియంట్లలో, ఆరు రంగుల్లో ఈ కారు లభించనుంది. దేశవ్యాప్తంగా 152 షోరూంలలో ఇది అందుబాటులో ఉంటుంది. క్యాబిన్, బూట్ స్పేస్ 526 లీటర్లు, 20 సెంటీ మీటర్ల కాక్పిట్, యాప్ కనెక్టివిటీ తదితర ఫీచర్లు అందుబాటులో ఉంటాయి.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.