న్యూ బీఎండబ్ల్యూ ఎక్స్ 4 భారతదేశంలో విడుదలైంది. అద్భుతమైన డిజైన్ అంశాలు, జోడించిన పరికరాలు, ఆకర్షణీయమైన ఫీచర్లతో స్పోర్ట్స్ యాక్టివిటీ- కూపే ని బీఎండబ్ల్యూ రిఫ్రెష్ చేసింది. ఈసందర్భంగా బీఎండబ్ల్యూ గ్రూప్ ఇండియా ప్రెసిడెంట్ విక్రమ్ పవాహ్ మాట్లాడుతూ… బీఎండబ్ల్యూ ఎక్స్ 4 భారతదేశంలో విలక్షణమైన స్పోర్ట్స్ యాక్టివిటీ- కూపే కాన్సెప్ట్‌ను నెలకొల్పి, గుర్తింపు దక్కించుకుందన్నారు. లగ్జరీ స్పోర్ట్స్ యాక్టివిటీ- వెహికల్‌కు సమానమైన ప్రాక్టికాలిటీ-, స్పేస్, పనితీరును డిమాండ్ చేసే విభిన్న శైలిని కలిగి ఉన్న వినియోగదారులు తక్షణమే ఎంపిక చేసుకునే వాహనంగా ఇది మారిందన్నారు. అలాగే ఇది బీఎండబ్ల్యూ ఎక్స్ 4 కు యూఎస్పీ అన్నారు. ఇది రోజువారీ ప్రాక్టికాలిటీ-, స్పోర్టీ అడ్వెంచర్ అవసరాలతో షీర్ డ్రైవింగ్ ప్లెజర్‌ను అనుసంధానం చేసే విధానం ప్రత్యేకమైందన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..