Saturday, November 23, 2024

కోవిడ్ ఎఫెక్ట్.. కుప్పకూలిన మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా ఐదో రోజు నష్టాలతోనే ముగిసాయి. ఉదయం మార్కెట్లు ప్రారంభమయినప్పుడు లాభాల్లోనే ట్రేడయ్యాయి. కాని మధ్యాహ్నం తర్వాత మార్కెట్లు పూర్తిగా నష్టాల్లోకి జారుకున్నాయి. దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటంతో మదుపర్లు అప్రమత్తమయ్యారు. తమ షేర్లను అమ్ముకునేందుకు మొగ్గు చూపారు. దీంతో ఈరోజు ఒకానొక సమయలో దాదాపు 500 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్… ఆ తర్వాత భారీ నష్టాల్లోకి జారుకుంది. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 585 పాయింట్లు కోల్పోయి 49,216కి పడిపోయింది. నిఫ్టీ 163 పాయింట్లు నష్టపోయి 14,557కి దిగజారింది. 

Advertisement

తాజా వార్తలు

Advertisement