ఓపెన్ ఏఐ చాట్‌జీపీటీ ఉద్యోగాల్ని లాక్కుంటుందని, మానవాళికి పెను ముప్పు అంటూ చాట్‌జీపీటీ గురించి పెద్ద చర్చ నడుస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఇన్ఫోసిస్ సహవ్యవస్థాపకులు నారాయణ మూర్తి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్‌జీపీటీపై కీలక వాక్యాలు చేశారు. నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ.. ఈ చాట్‌బాట్మ నుషులను రీప్లేస్ చేయలేవని నారాయణ మూర్తి అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం చాట్‌జీపీటీ హవా నడుస్తున్న నేపథ్యంలో.. చాట్‌జీపీటీతో పెద్ద ఎత్తున ఉద్యోగాలు పోతాయనే వాదనలు వినిపిస్తున్న తరుణంలో నారాయణ మూర్తి ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే చాట్‌జీపీటీ గొప్పదే అనే అభిప్రాయం వ్యక్తం చేశారు.
‘సమాచారం సేకరించేందుకు, విషయ సముపార్జనకు.. చాట్‌జీపీటీ గొప్ప సాధనం. అయితే.. అది కొన్ని విషయాల్లో మనుషులతో పోటీ పడటం కష్టం. మనిషి మెదడును మించిన యంత్రం ఇంకొకటి లేదని నమ్మేవాళ్లలో నేను కూడా ఒకర్ని. అందుకే.. చాట్‌జీపీటీ వంటి ఏఐ చాట్‌బాట్స్ ఎప్పటికీ మనుషుల్ని మాత్రం భర్తీ చేయలేవు.’ అని అన్నారు నారాయణ మూర్తి.
గతంలో కూడా నారాయణ మూర్తి చాట్‌జీపీటీ గురించి ఒక చర్చలో భాగంగా మాట్లాడారు. అప్పుడు కూడా ఇలాంటి అభిప్రాయాన్నే వ్యక్తం చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా ఎక్కువ మంది ఉద్యోగాలు కోల్పోతారనే వాదనలు వెలువడిన నేపథ్యంలోనే.. మూర్తి వాటితో ఇలా విభేదించారు. కొద్దిరోజుల కిందట.. AI, చాట్‌జీపీటీతో భవిష్యత్తులో మానవాళికి ప్రమాదం ఉందని, చాట్‌జీపీటీ సహా భవిష్యత్తులో అలాంటి వాటి అభివృద్ధిని నిలిపివేయాల్సిన అవసరం ఉందని ప్రపంచ కుబేరులు, టెస్లా, స్పేస్ ఎక్స్, టెస్లా సంస్థల సీఈఓ ఎలాన్ మస్క్ అన్నారు. మస్క్‌తో కలిసి మరికొందరు నిపుణులు.. దీనిపై సంతకాలు చేసి బహిరంగ లేఖను విడుదల చేశారు. అయితే చాట్‌జీపీటీ మాత్రం.. తన పని చేసుకుంటూ పోతోంది. దీనిని జనం వివిధ రకాలుగా వాడుకుంటున్నారు. కొందరు చాట్‌జీపీటీ గురించి అవగాహన కల్పిస్తూ డబ్బులు కూడా సంపాదిస్తుండటం విశేషం.