Wednesday, November 20, 2024

ముత్తూట్‌ మినీ టార్గెట్‌ 4000 కోట్లు..

బంగారం తాకట్టు బిజినెస్‌లో ఉన్న ముత్తూట్‌ మినీ ఈ ఆర్థిక సంవత్సరం 60 శాతం వృద్ధితో 4000 కోట్ల బిజినెస్‌ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ 25 శాతం వృద్ధితో 2,500 కోట్ల బిజినెస్‌ చేసింది. అంతకు క్రితం సంవత్సరం ఇది 1994 కోట్లుగా ఉందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో భారీ ఎత్తున విస్తరణకు వెళ్లాలని నిర్ణయించినందున 60 శాతం వృద్ధితో నాలుగు వేల కోట్ల బిజినెస్‌ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపింది. దీని మాతృ సంస్థ ముత్తూట్‌ ఫైనాన్స్‌ 60 వేల కోట్ల బిజినెస్‌తో అగ్రభాగనా ఉంది. మరో సంస్థ ముత్తూట్‌ ఫిన్‌కార్ప్‌ పది వేల కోట్ల రుణాలు ఇచ్చింది. సంస్థ లోన్‌ గ్రోత్‌ రేటు మూడు సంవత్సరాల్లో 22 శాతం నుంచి 25 శాతానికి మూడో సంవత్సరం 45 శాతానికి పెరిగింది.

ఈ ఆర్థిక సంవత్సరంలో 170 కొత్త బ్రాంచ్‌లు ప్రారంభించాలని నిర్ణయించామని, బిజినెస్‌ టార్గెట్‌ 4 వేల కోట్లుగా నిర్ణయించుకున్నామని సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ముత్తూట్‌ పీటీఐకి తెలిపారు. కొత్త బ్రాంచ్‌లు గుజరాత్‌, మహారాష్ట్ర, హర్యానా, ఢిల్లి ఎన్‌సీఆర్‌, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. కంపెనీ ప్రస్తుతం 830 బ్రాంచ్‌లు కలిగి ఉంది. 4 లక్షల మంది కస్టమర్లు ఉన్నారు. కంపెనీ వద్ద 10 టన్నుల బంగారం ఉంది. సంస్థలో నాలుగు వేల మంది సిబ్బంది పని చేస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement