Tuesday, November 26, 2024

Hospital | మల్టీ-స్పెషాలిటీ కన్సల్టేషన్సీ.. నెల్లూరులో రేలా మెడికల్ సెంటర్

నెల్లూరు, ఆగస్టు 3: చెన్నైలోని ప్రముఖ మల్టీస్పెషాలిటీ మరియు క్వాటర్నరీ హెల్త్‌కేర్ సెంటర్ అయిన రేలా హాస్పిటల్, నెల్లూరు మరియు పొరుగు జిల్లాల ప్రజలకు నిపుణుల కన్సల్టేషన్స్ మరియు ఇతర ప్రపంచ స్థాయి ఆరోగ్య సంరక్షణ సేవలను అందించడానికి నెల్లూరులో రేలా మెడికల్ సెంటర్‌ను ప్రారంభించింది. రెలా హాస్పిటల్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ప్రొ. మొహమ్మద్ రేలా మరియు రెలా గ్రూప్‌లోని ప్రముఖ సర్జన్లు మరియు హెల్త్‌కేర్ నిపుణుల సమక్షంలో హాస్పిటల్‌ను తమిళనాడు మెడికల్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్, జనరల్ మరియు వాస్కులర్ సర్జన్ ప్రొఫెసర్ సి.ఎం.కె. రెడ్డి ప్రారంభించారు.

ఈ కార్యక్రమానికి గౌరవ అతిథిగా చిత్తూరు జిల్లాకు చెందిన 8 ఏళ్ల జ్ఞాన సాయి హాజరయ్యారు. చిన్నతనంలోనే ప్రాణాంతక కాలేయ వ్యాధిని ఆమె అధిగమించింది. జ్ఞాన సాయి 2016లో రేలా హాస్పిటల్‌లో ప్రాణాలను రక్షించే కాలేయ మార్పిడి శస్త్ర చికిత్స ను పొందారు, ఆమెకు కేవలం తొమ్మిది నెలల వయస్సులో ఈ చికిత్సను ప్రొఫెసర్ మహమ్మద్ రేలా నిర్వహించారు. మొదట్లో తమ బిడ్డ పై ఆశను కోల్పోయిన ఆమె తల్లిదండ్రులు తమ బిడ్డను మెర్సీ కిల్లింగ్ చేయాల్సిందిగా కోర్టును సైతం ఆశ్రయించారు. అయితే, అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు జోక్యం చేసుకుని ప్రొఫెసర్ రేలాకు కేసును రిఫర్ చేశారు. ఇప్పుడు, ట్రాన్స్‌ప్లాంట్ చేసిన ఎనిమిదేళ్ల తరువాత , జ్ఞాన సాయి వైద్య కేంద్రం ప్రారంభోత్సవంలో పాల్గొంది. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ రేలా వద్ద చికిత్స పొందిన ముగ్గురు పెద్ద వయసు రోగులు కూడా హాజరయ్యారు.

- Advertisement -

ఈ కొత్త సౌకర్యం, క్లినిక్ శైలిలో గాంధీ నగర్, పొగతోట, నెల్లూరులో ఉంది. ఇది హెపటాలజీ, పీడియాట్రిక్ హెపటాలజీ, HPB & కాలేయ మార్పిడి, న్యూరో సర్జరీ, న్యూరాలజీ, వెన్నెముక మరియు స్పోర్ట్స్ మెడిసిన్, మెడికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ, రేడియేషన్ ఆంకాలజీ, ఇంటర్వెన్షనల్ రేడియాలజీ, కార్డియోథొరాసిక్ మరియు వాస్కులర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జరీ, గుండె మరియు ఊపిరితిత్తుల మార్పిడి, పల్మోనాలజీ, మరియు కార్డియాలజీ వంటి స్పెషలైజేషన్లలో కన్సల్టేషన్స్ ను అందిస్తుంది. చెన్నైలోని రేలా హాస్పిటల్ నుండి ఈ విభాగాల నిపుణులు కన్సల్టేషన్స్ అందించడానికి క్రమం తప్పకుండా ఈ సెంటర్ ను సందర్శిస్తారు. విజయవాడ మరియు వైజాగ్‌లలో ఎముక మజ్జ మార్పిడి, కాలేయం & గుండె మార్పిడిలో కన్సల్టేషన్స్ అందించడానికి క్లినిక్‌ల తరహాలో ఇలాంటి ఆరోగ్య కేంద్రాలను రేలా హాస్పిటల్ నడుపుతోంది.

ఈ సందర్భంగా , రేలా హాస్పిటల్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ప్రొఫెసర్ మొహమ్మద్ రేలా మాట్లాడుతూ, “ప్రధాన మల్టీస్పెషాలిటీ మరియు క్వాటర్నరీ హెల్త్‌కేర్ కేంద్రంగా, మా లక్ష్యం మా రోగులకు అత్యున్నత స్థాయి ఆరోగ్య సంరక్షణను అందించడం. మా చెన్నై ఆసుపత్రి, 130 క్రిటికల్ కేర్ బెడ్‌లు మరియు 9 అధునాతన ఆపరేషన్ సూట్‌లతో సహా, దాని 450 పడకలతో 50 విభాగాలకు పైగా సేవలను అందిస్తోంది మరియు 130 మంది గౌరవనీయ నిపుణులు మద్దతునిస్తున్నారు. ఈ అసాధారణమైన సంరక్షణ మరియు నైపుణ్యాన్ని చెన్నై దాటి రోగులకు విస్తరించాలని మేము లక్ష్యంగా పెట్టుకున్నాము. మా వైద్య కేంద్రాలు అత్యున్నత స్థాయి నిపుణులు, అత్యాధునిక సాంకేతికత మరియు నాణ్యమైన సంరక్షణను ద్వితీయ శ్రేణి నగరాలకు తీసుకురావడానికి రూపొందించబడ్డాయి. ఈ నేపధ్యంలో ఈరోజు నెల్లూరులో మా కొత్త వైద్యకేంద్రం ప్రారంభం కావడం . ఈ ప్రత్యేక సందర్భం కోసం మాతో చేరిన జ్ఞాన సాయి వంటి విలువైన రోగులతో మళ్లీ కనెక్ట్ అవ్వడం చాలా ఆనందంగా ఉంది..” అని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement