రిలయన్స్ జియో టెలికమ్ మొదటి త్రైమాసిక ఆర్ధిక ఫలితాలు వెల్లడించింది. ఈ త్రైమాసికంలో జియో నికర లాభం 12.2 శాతం వృద్ధితో 4,863 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గత సంవత్సరం ఇదే త్రైమాసికంలో సంస్థ లాభం 4,445 కోట్లు మాత్రమే.
మొదటి త్రైమాసికంలో జియో మొత్తం ఆదాయం 24,127 కోట్లుగా ఉంది. ఈ త్రైమాసికంలో జియో నెట్‌వర్క్ విస్తరణకు భారీగా వ్యయం చేసింది.
ప్రధానంగా 5జీ విస్తరణ కోసం పెట్టుబడులు పెడుతున్నది. టారిఫ్ విషయంలో జియోకు ట్రాయ్ క్లీన్ చిట్ ఇచ్చింది. జియో బ్రాడ్ బ్యాండ్ ద్వారా టీవీ ఛానెల్స్‌ను అందించడం ద్వారా మోసపూరిత ధరల విధానాన్ని అనుసరిస్తుందని జియోపై వచ్చిన ఫిర్యాదుపై ట్రాయ్ విచారణ జరిపింది.
- Advertisement -