రిలయన్స్ ఇండస్ట్రీట్ చైర్మన్ ముఖేష్ అంబానీ వరుసగా రెండో ఏడాది కూడా జీతం తీసుకోలేదు. కరోనా మహమ్మారి సమయంలో జీతాన్ని బాధితులకు ఇచ్చేయాలని స్వచ్ఛందంగా నిర్ణయించుకున్న నేపథ్యంలో ఆయన ఈ సంప్రదాయాన్ని కొనసాగించారు. జీతమే కాదు అదనంగా ఇచ్చే భత్యాలు, ప్రోత్సాహకాలు, ఇతర ఆర్థిక ప్రయోజనాలనూ ఆయన స్వీకరించలేదు. ఈ విషయాన్ని రిలయన్స్ ఇండస్ట్రీస్ తన వార్షిక నివేదికలో పేర్కొంది. సాధారణంగా చైర్మన్, మేనేజింగ్ డైరక్టర్ హోదాలో ముఖేష్ అంబానీ వార్షిక వేతనంగా రూ.15 కోట్లకు పైగానే తీసుకుంటారు. 2008-09 నుంచి ఆయన ఆ మొత్తాన్ని జీతంగా తీసుకుంటున్నారు.
ఇతర ఆర్థిక ప్రయోజనాలతో కలగలపి మొత్తం 24 కోట్ల మేర ఆయనకు అందేది. 2020లో కోవిడ్ తీవ్ర స్థాయిలో వ్యాపించి వేలమంది మరణించడం, లక్షలమంది ఆర్థికంగా దెబ్బతినడంవంటి పరిణామాల్లో వారిని ఆదుకునేందుకు జీతాన్ని వదులుకోవాలని నిర్ణయించుకున్నారు. 2020, 2021లలో ఆయన మొత్తం వేతనాన్ని కరోనా కట్టడి, బాధితుల కోసం విరాళంగా ఇచ్చారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.