ప్రముఖ బ్రోకరేజీ సంస్థ మోర్గాన్ స్టాన్లీ దేశ ఆర్థిక వృద్ధిరేటు 7.2 శాతం ఉంటుందని అంచనా వేసింది. గతంలో ఈ సంస్థ వృద్ధిరేట్లు 7.6గా అంచనా వేసింది. ప్రపంచ వ్యాప్తంగా వాణిజ్యం మందగించడం, ఆర్థిక వ్యవస్థల వృద్ధిరేటు తగ్గడం వంటి పలు కారణాల వల్ల మన ఆర్ధిక వ్యవస్థ వృద్ధిరేట్లు కూడా అంచనాల కంటే తగ్గుతుందని తెలిపింది. రిజర్వ్ బ్యాంక్ అంచనాల ప్రకారం కూడా ఈ
సంవత్సరం మొదటి మూడు నెలల్లో వృద్ధిరేటు 4.1 శాతం ఉంటుందని తెలిపింది. వచ్చే సంవత్సరం ఆర్ధిక వ్యవస్థ వృద్ధిరేటు 6.4 శాతం ఉంటుందని ఈ సంస్థ అంచనా వేసింది.
ప్రపంచ వ్యాప్తంగా ఆర్ధిక మాంధ్యం భయాలు, పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు అన్ని సెంట్రల్ బ్యాంక్లు వడ్డీరేట్లను పెంచుతున్నాయి. రిజర్వ్ బ్యాంక్ సైతం ఇప్పటికే రెండు సార్లు వడ్డీ రేట్లను పెంచింది. వినియోగదారుల ద్రవ్యోల్బణం జూన్లో 7.01 శాతం నమోదైందని, ఇది ముందు ముందు మరింత పెరిగే అవకాశం ఉందని మోర్గాన్ స్టాన్లీ అంచనా వేసింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.