Thursday, November 21, 2024

హిందూజా గ్రూప్‌ నుంచి మరిన్ని ఈవీలు.. మార్కెట్‌ విస్తరణకు పెట్టుబడులు

హిందూజా గ్రూప్‌కు చెందిన అశోక్‌ లేలాండ్‌ ఈవీ వాహన రంగంలో విస్తరించాలని నిర్ణయించింది. ఇప్పటికే అశోక్‌ లేలాండ్‌ ఇప్పటికే స్విచ్‌ మొబిలిటి పేరుతో విద్యుత్‌ వాహనాలను ఉత్పత్తి చేస్తోంది. ప్రస్తుతం స్విచ్‌ మొబిలిటి బ్రిటన్‌, యూరోప్‌ మార్కెట్‌లోకి విస్తరించాలని నిర్ణయించింది. ఇందు కోసం కంపెనీ 200-250 మిలియన్‌ డాలర్ల పెట్టుబడులను 2,3 సంవత్సరాల్లో సమీకరించాలని నిర్ణయించిందని హిందూజా గ్రూప్‌ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌ ధీరజ్‌ హిందూజా తెలిపారు.

మిడిల్‌ ఈస్ట్‌లో ప్రవేశం

హిందూజా గ్రూప్‌ స్విచ్‌ మొబిలిటి విద్యుత్‌ వాహనాలను మిడిల్‌ ఈస్ట్‌ మార్కెట్‌లో ప్రవేశపెట్టాలని నిర్ణయించిందని ధీరజ్‌ హిందూజా తెలిపారు. మిడిల్‌ ఈస్ట్‌ మార్కెట్‌లో ప్రధానంగా విద్యుత్‌ బస్సులను 2023లో ప్రవేశపెట్టనున్నట్లు ఆయన వెల్లడించారు. బస్సులను మార్కెట్లోకి తీసుకు రావడానికి ముందే వాటిని పరీక్షించడం చాలా ప్రధానమైందని చెప్పారు.
ప్రపంచ వ్యాప్తంగా ఆర్ధిక వ్యవస్థల వృద్ధిరేటు నెమ్మదించినందున ఇన్వెస్టర్‌ కోసం తాము ఆతృతపడటంలేదని చెప్పారు. ఇండియాలోనూ, బ్రిటన్‌లోనూ కంపెనీ పలు ఈవీ వాహనాలను మార్కెట్‌ చేస్తుందని ధీరజ్‌ హిందూజా వివరించారు. మాతృ సంస్థ అశోక్‌ లేలాండ్‌ నుంచి స్విచ్‌ మొబిలిటికి మంచి మద్దతు లభిస్తుందని ఆయన చెప్పారు.

త్వరలో కొత్త ఈవీలు

హిందూజా కంపెనీకి చెందిన పాపులర్‌ అయిన దోస్త్‌, బడే దోస్త్‌ కమర్షియల్‌ వాహనాలను విద్యుత్‌ వెర్షన్లను 2023లో తీసుకు రానున్నట్లు తెలిపారు. ఇండియా, బ్రిటన్‌లోనూ స్విచ్‌ మొబిలిటి విద్యుత్‌ వాహనాల తయారీ రంగంలో విజయవంతమైన కంపెనీగా నిలిచిందన్నారు. ప్రస్తుతం కంపెనీ యూరోపియన్‌ మార్కెట్‌ కోసం విద్యుత్‌ డబుల్‌ డెక్కర్‌ బస్సులను సరఫరా చేస్తోంది. కంపెనీ కొత్తగా 12 మీటర్ల పొడవైన విద్యుత్‌ బస్సు ఈ2ను 2023లో లాంచ్‌ చేస్తుందని ఆయన తెలిపారు. డెబుల్‌ డెక్కర్‌ విద్యుత్‌ బస్సులు త్వరలోనే మన దేశ మార్కెట్లోనూ రానున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement