ముంబై: ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్‌లు, పర్సనల్ కంప్యూటర్‌ల దిగుమతుల కోసం భారతదేశం కొత్త అధికార వ్యవస్థను ప్రారంభిస్తోందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. మార్కెట్ సరఫరాను దెబ్బతీయకుండా అటువంటి హార్డ్‌వేర్ రవాణాను పర్యవేక్షించే లక్ష్యంతో కొత్త ”దిగుమతి నిర్వహణ వ్యవస్థ” నవంబర్ 1 నుండి అమలులోకి రానుంది. దీని ప్రకారం కంపెనీలు దిగుమతుల పరిమాణం, విలువను నమోదు చేయవలసి ఉంటుంది.
అయితే ప్రభుత్వం ఎటువంటి దిగుమతి అభ్యర్థనలను తిరస్కరించదు. పర్యవేక్షణ కోసం డేటాను ఉపయోగిస్తుందని సదరు అధికారులు తెలిపారు. ”ఇవన్నీ మనకు పూర్తి విశ్వసనీయమైన డిజిటల్ వ్యవస్థను కలిగి ఉన్నాయని నిర్ధారించుకోవడానికి అవసరమైన డేటా , సమాచారాన్ని అందించేలా చూడటం” దీని ఉద్దేశమని ఎలక్ట్రానిక్స్, ఇన్ఫోటెక్ మంత్రిత్వ శాఖలోని టాప్ బ్యూరోక్రాట్ కృష్ణన్ అన్నారు.