Friday, November 22, 2024

1000 మంది ఉద్యోగులను తొలగించిన మైక్రోసాఫ్ట్‌

ప్రముఖ టెక్నాలజీ కంపెనీ మైక్రోసాఫ్ట్‌ 1000 మంది ఉద్యోగులను తొలగించింది. మైక్రోసాఫ్ట్‌లో 221,000 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. మైక్రోసాఫ్ట్‌కు అనుబంధంగా ఉన్న ఎక్స్‌బాక్స్‌, ఎడ్జ్‌ టీమ్స్‌, యాక్సోస్‌ వంటి విభాగాల నుంచి ఈ వెయ్యి మందిని తొలగించినట్లు కంపెనీకి చెందిన ఒక అధికారి తెలిపారు.

ఆర్ధిక మాంద్యం వస్తుందన్న అంచానలతో మైక్రోసాఫ్ట్‌ ఉద్యోగులను తొలగించేందుకు నిర్ణయించింది. ఉద్యోగుల సంఖ్యను తగ్గించాలని నిర్ణయించినట్లు మైక్రోసాఫ్ట్‌ ఇటీవలనే ప్రకటించింది. అమెరికాలో ఇప్పటికే ఫేస్‌బుక్‌ మాతృ సంస్థ మెటా, ట్విట్టర్‌, స్నాప్‌ ఇంక్‌ వంటి కంపెనీలు ఉద్యోగులను తగ్గిస్తున్నాయి. స్నాప్‌ కంపెనీ ఈ సంవత్సరం ఆగస్టులో మొత్తం ఉద్యోగుల నుంచి 20 శాతం తగ్గించాలని నిర్ణయించినట్లు ప్రకటించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement