Tuesday, November 26, 2024

తిరిగి మార్కెట్‌లోకి వస్తున్న మైక్రోమ్యాక్స్‌, కార్బన్‌ మొబైల్‌ బ్రాండ్స్‌

దేశీయ బ్రాండ్లుగా ఉన్న మైక్రోమ్యాక్స్‌, కార్బన్‌, లావా మొబైల్‌ ఫోన్లు మళ్లిd మార్కెట్‌లో భారీ స్థాయిలో రానున్నాయి. చైనా ఫోన్ల ప్రవేశంతో ఈ కంపెనీల ఫోన్ల అమ్మకాలు పడిపోవడంతో ఇవి ఉత్పత్తిని నిలిపివేశాయి. ప్రస్తుతం అన్ని చైనా మొబైల్‌ కంపెనీలు ప్రభుత్వం నిఘాలో ఉండటంతో పాటు, 8వేల లోపు స్మార్ట్‌ సెగ్మెంట్‌లో ఈ కంపెనీలు పెద్దగా మోడల్స్‌ను మార్కెట్‌లోకి తీసుకు రావడంలేదు. ఈ కంపెనీలు ప్రస్తుం ప్రీమియం ఫోన్లపై దృష్టి కేంద్రీకరించాయి.

ప్రస్తుతం స్మార్ట్‌ మార్కెట్‌లో పెద్ద కంపెనీల మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. దీన్ని తట్టుకోవాలంటే ఈ కంపెనీలు టెక్నాలజీపై భారీగా పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుందని మార్కెట్‌ వర్గాలు విశ్లేషిస్తున్నారు. చైనా కంపెనీలపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తున్నప్పటికీ స్మార్ట్‌ ఫోన్‌ మార్కెట్‌లో ప్రస్తుతం చైనా కంపెనీలైన షావోమీ, రియల్‌మీ, ఒప్పో, వివో, వన్‌ ప్లస్‌ కంపెనీలదే అగ్రస్థానం. మరో విదేశీ కంపెనీ శామ్‌సంగ్‌ మొబైల్స్‌ కూడా మంచి మార్కెట్‌ వాటా కలిగి ఉంది.

చైనా మొబైల్‌ కంపెనీలు రానున్న రోజుల్లో 10వేలలోపు ధరలో 5జీ స్మార్ట్‌ ఫోన్లను మార్కెట్‌లో లాంచ్‌ చేయనున్నాయి. ప్రస్తుతం చైనా మొబైల్స్‌ కంపెనీల మార్కెట్‌ వాటా 81 శాతంగా ఉంది. లోకల్‌ బ్రాండ్‌ఫోన్ల మార్కెట్‌ 1 శాతంగా మాత్రమే ఉంది.
తిరిగి మార్కెట్‌లోకి ప్రవేశించాలని భావిస్తున్న మైక్రోమ్యాక్స్‌, కార్బన్‌, లావా కంపెనీలు ఆర్‌ అండ్‌ డీపై ఎక్కువ దృష్టి పెట్టాల్సి ఉందని పరిశ్రమ నిపుణులు సూచిస్తున్నారు. ఎంట్రీ లెవల్‌ ఫోన్లలో ఎక్కువ ఫీచర్లు అందించగలిగితే వీటికి మార్కెట్‌లో ఆదరణ ఉంటుందని వారు అభిప్రాయపడుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement