Sunday, November 24, 2024

MG Motors | వచ్చే 2 సంవత్సరాల్లో 7 కొత్త మోడల్స్‌

ఎంజీ మోటార్స్‌ ఇండియా దేశ మార్కెట్‌లో రానున్న రెండు సంవత్సరాల్లో 7 కొత్త మోడల్స్‌ను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఇండియాలో జేఎస్‌డబ్ల్యూ గ్రూప్‌తో జాయింట్‌ వెంచర్‌గా కార్యకలాపాలను నిర్వహించాలని ఎంజీ మోటార్స్‌ నిర్ణయించింది. ఈ ఒప్పందం తరువాత కంపెనీ దేశంలోని డీలర్స్‌తో ఎంజీ మోటార్స్‌ ప్రధాన కార్యాలయం ఉన్ను షాంఘైలో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. డీలర్స్‌ సమావేశంలో కంపెనీ రానున్న 24 నెలల్లో ఇండియన్‌ మార్కెట్‌లోకి తీసుకురానున్న మోడల్స్‌ను పరిచయం చేసింది.

బ్రిటన్‌కు చెందిన సౖౖెక్‌ మోటార్స్‌కు ఎంజీ మోటార్స్‌లో అత్యధిక వాటా కలిగి ఉంది. నవం బర్‌ 30న జేఎస్‌డబ్ల్యూ కలిసి జాయింట్‌ వెంచర్‌ ఏర్పాటు చేస్తున్నట్లు సై క్‌ ప్రకటించింది. ఎంజీ మోటార్స్‌ చైనాకు చెందిన సంస్థ. ఎంజీ మోటార్స్‌ ఇండియా జాయింట్‌ వెంచర్‌లో జేఎస్‌డబ్ల్యూ గ్రూప్‌కు 35 శాతం వాటా ఉంటుంది. ఎంజీ మోటార్స్‌ ఇండియాలో విస్తరణకు భారీ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది.

భారత్‌ మార్కెట్లోకి ఎంజీ మోటార్స్‌ ప్రధానంగా హైబ్రీడ్‌ కార్లు, విద్యుత్‌ కార్లపై ప్రధాన దృష్టి పెట్టింది. ఎంజీ మోటార్స్‌ ఇండియా ప్రస్తుం విక్రయిస్తున్న అన్ని పెట్రోల్‌ కార్లను అప్‌డేట్‌ చేయాలని నిర్ణయించింది. వచ్చే సంవత్సరం ఎంజీ గ్లోస్టర్‌ కార అప్‌డెట్‌ వెర్షన్‌ను విడుదల చేయనుంది. ప్లగ్‌ ఇన్‌ హైబ్రీడ్‌ ఎస్‌యూవీ కారు ఈహెచ్‌ఎస్‌, మైఫా9 వి ద్యుత్‌ కారు, ఎంజీ4 హెచ్‌బ్యాక్‌ విద్యుత్‌ కారు, ఎంజీ5 విద్యుత్‌ కారును భారత మార్కెట్లోకి తీసుకురానుంది.

భారత మార్కెట్‌లో అమ్మకాలు భారీగా పెంచుకునేందుకు ఎంజీ మోటార్స్‌ కొత్త మోడల్స్‌ను తీసుకు వస్తోంది. ఎంజీ మోటార్స్‌, జేఎస్‌డబ్ల్యూ జాయింట్‌ వెంచర్‌ దేశవ్యాప్తంగా డీలర్ల నెట్‌వర్క్‌ను గణనీయంగా పెంచుకోవాలని నిర్ణయించాయి. ఈ డిసెంబర్‌ 31 నాటికి ఎంజీ మోటార్స్‌ 270 పట్టణాల్లో 400 డీలర్‌షిప్‌లకు చేరుకోనుంది. ఎంజీ మోటార్స్‌ ఇండియాలో సైక్‌ కంపెనీ 5వేల కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ప్రభుత్వానికి 2020లో పంపించిన ప్రతిపాదనకు ఇంకా ఆమోదం లభించలేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement