Friday, November 22, 2024

WhatsApp బిజినెస్‌ అకౌంట్స్‌కు మెటా వెరిఫైడ్‌..

భారత్‌లో వాట్సప్‌ బి జినెస్‌ యూజర్ల కోసం వెరిఫైడ్‌ ప్రోగ్రామ్‌ను మెటా ప్రారంభించింది. ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రస్తుతం ఈ వెరిఫికేషన్‌ ఆప్షన్‌ ఉంది. వాట్సప్‌ బిజినెస్‌ యాప్‌ వాడే వారి కోసం గత సంవత్సరం సెప్టెంబర్‌లోనే మెటా వెరిఫైడ్‌ ప్రోగ్రామ్‌ను తీసుకు వచ్చింది.

తాజాగా భారత్‌తో పాటు బ్రెజిల్‌, ఇండోనేషియా, కొలంబియా దేశాల్లో వాట్సప్‌ బిజినెస్‌ యూజర్ల కోసం దీన్ని అందుబాటులోకి తీసుకు వచ్చింది. అందరికి సుపరిచితమైన బ్లూటిక్‌నే వెరిఫైడ్‌గా వ్యవహరిస్తారు. ఇన్‌స్టా, ఫేస్‌బుక్‌లో తరహాలోనే మర్చంట్స్‌ తమ వాట్సప్‌ బిజినెస్‌ అకౌంట్‌కు మెటా వెరిఫైడ్‌ సబ్‌స్క్రిప్షన్‌ తీసుకోవాల్సి ఉంటుంది.

దీన్ని తీసుకున్నవారికి వాట్సప్‌ బిజినెస్‌ బ్లూటిక్‌ను జారీ చేస్తారు. దీని వల్ల ఈ బిజినెస్‌ పేరుతో మరొకరు ఖాతా తెరవకుండా రక్షణ కల్పించడంతో పాటు, మార్కెటింగ్‌ అవసరాల కోసం వాట్సప్‌ ఛానెల్‌ను కూడా మెటా అందిస్తుంది. సబ్‌స్క్రిప్షన్‌ తీసుకున్న వాట్సప్‌ బిజినెస్‌ యూజర్లు వివిధ డివైజుల నుంచి లాగిన్‌ అవ్వడానికి వీలుంటుంది.

దీంతోపాటు కస్టమర్లకు, వెండర్లకకు కనిపించేలా వ్యాపార వివరాలతో కూడిన కస్టమ్‌ వెబ్‌పేజీని కూడా క్రియేట్‌ చేసుకోవచ్చు. వ్యక్తిగత ఫోన్‌ నెంబర్‌ను ఇవ్వకుండానే కస్టమర్‌ సపోర్టుకు నేరుగా కాల్‌ చేసుకునే సదుపాయంపై మెటా ప్రస్తుతం పని చేస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement