Tuesday, November 26, 2024

లగ్జరీ కార్ల మార్కెట్‌లో మెర్సిడెజ్‌ బెంజ్‌ దూకుడు.. గతేడాది కంటే 13 శాతం వృద్ధి

జర్మనీకి చెందిన ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెజ్‌ బెంజ్‌ భారతీయ మార్కెట్‌లో దౌడు తీస్తోంది. ఈ ఏడాది ప్రథమార్ధంలో 8258 కార్లను విక్రయించింది. ఇది గతేడాది కంటే 13శాతం అధికం. గతేడాది ఇదే సమయంలో 7573 కార్లను విక్రయించినట్లు కంపెనీ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ ఏడాది రెండవ త్రైమాసికంలో 3831 యూనిట్ల వాహనాలను విక్రయించామని, గతేడాదితో పోల్చితే ఇది 8 శాతం అధి కమని తెలిపింది.

ఈ సందర్భంగా కార్ల అమ్మకానికి సంబంధించిన డేటాను విడుదల చేసింది. తొలి అర్ధభాగంలో విక్రయించిన కార్లలో 2వేల కార్ల ధర రూ.1.5 కోట్ల పైబడిందని తెలిపింది. అంటే ప్రతి నాలుగు కార్లలో ఒకటి టాప్‌ ఎండ్‌ వాహనమేనని పేర్కొంది. టాప్‌ఎండ్‌ సెగ్మెంట్‌లో ఐదు కొత్త ఉత్పత్తులను తీసుకొచ్చామని మెర్సిడెజ్‌ ఇండియా మేనేజింగ్‌ డైరెక్టర్‌, సీఈవో సంతోష్‌ అయ్యర్‌ చెప్పారు. ఈ సెగ్మెంట్‌లో 6 నెలల నుంచి 24 నెలల వరకు వెయిటింగ్‌ పీరియడ్‌ ఉందన్నారు. టాప్‌ ఎండ్‌ వెహికిల్స్‌లో జీఎల్‌సీ పాపులర్‌ సెల్లింగ్‌ మోడల్‌గా ఉందని అయ్యర్‌ వివరించారు

Advertisement

తాజా వార్తలు

Advertisement