మారుతీ సుజుకీ తన పాపులర్ వేరియంట్ స్విఫ్ట్ లో సీఎన్‌జీ వేరియంట్‌ను విడుదల చేసింది. ఈ కారు ఎక్స్‌షోరూమ్ ప్రారంభ ధర 8.19 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది. సీఎన్‌జీ స్విఫ్ట్‌ను అధిక ఇంధన సామర్ధ్యంతో తీసుకు వచ్చింది. దీంతో మొత్తం మారుతీ సుజుకీ పోర్ట్‌ఫోలియోలో 14 సీఎన్‌జీ మోడల్స్ అయ్యాయి.
కొత్త సీఎన్‌జీ స్విఫ్ట్‌లో 1.2 లీటర్ల జెడ్ సిరీస్ డ్యూయల్ వీవీటీ ఇంజిన్ ఇచ్చారు. ఇది 69.75 పీఎస్ శక్తిని, 101.8 ఎన్‌ఎం పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు కిలో సీఎన్‌జీకి 32.85 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుందని మారుతీ సుజుకీ తెలిపింది. ఇందులో ఆరు ఎయిర్ బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ ప్లస్, మిల్ హోల్డ్ అసిస్ట్ వంటి సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి.
ఆటోమెటిక్ క్లైమెట్ కంట్రోల్, రియల్ ఏసీ వెంట్, వైర్‌లెస్ ఛార్జర్, 7 అంగుళాల స్మార్ట్ ప్లే ప్రొ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వంటి అత్యాధునిక ఫీచర్లు ఉన్నాయి. ఈ కారులో హై ఎండ్ ధరను 9.19 లక్షలుగా నిర్ణయించింది. హాచ్‌బ్యాక్‌ల విక్రయాల్లో మారుతీ సుజుకీ దూసుకుపోతున్నది. నాలుగు నెలల్లో 67 వేల యూన్లిను కంపెనీ విక్రయించింది.