మారుతీ సుజుకి సెప్టెంబర్లో అత్యధికంగా 181,343 యూనిట్ల నెలవారీ విక్రయాలను నమోదు చేసింది. టోకు విక్రయాలు వార్షిక ప్రాతిపదికన 3శాతం పెరిగి సెప్టెంబర్లో 1,81,343 యూనిట్లకు చేరుకున్నాయని ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొంది. దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థ గతేడాది ఇదే నెలలో 1,76,306 యూనిట్లను డీలర్లకు పంపింది.
మొత్తం దేశీయ ప్యాసింజర్ వాహనాల విక్రయాలు గత నెలలో 1,50,812 యూనిట్లకు పెరిగాయని, సెప్టెంబర్ 2022లో 1,48,380 యూనిట్ల నుంచి 2 శాతం పెరిగిందని తెలిపింది. ఏప్రిల్-సెప్టెంబర్ కాలంలో కంపెనీ మొత్తం విక్రయాలు 10 లక్షల మార్కును దాటాయి. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో 9,85,326 యూనిట్లతో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రథమార్థంలో 10,50,085 యూనిట్లను పంపింది.
కంపెనీ అర్ధవ్ఖార్షిక విక్రయాల మార్కు 1 మిలియన్ యూనిట్లను అధిగమించడం ఇదే మొదటిసారి అని వాహన తయారీ సంస్థ పేర్కొంది. సెప్టెంబరులో, కంపెనీ తన ఎంట్రీ లెవల్ కార్లు ఆల్టో,ఎస్ప్రెస్సో అమ్మకాలు 10,351 యూనిట్లుగా నమోదయ్యాయి, ఇది గతేడాదితో పోలిస్తే 29,574 యూనిట్ల నుండి 65 శాతం తగ్గింది.
.సెప్టెంబరు 2022లో 72,176 యూనిట్ల నుండి గతనెలలో కాంపాక్ట్ కార్ల విక్రయాలు 68,552 యూనిట్లకు తగ్గాయి. అయితే యుటిలిటీ వా#హనాల పంపిణీ గత ఏడాది సెప్టెంబర్లో 32,574 యూనిట్ల నుంచి 82 శాతం పెరిగి 59,271 యూనిట్లకు చేరుకుంది. మొత్తం ఎగుమతి విక్రయాలు 21,403 యూనిట్ల నుంచి 22,511 యూనిట్లకు పెరిగాయని కంపెనీ తెలిపింది.