దేశీయ కార్ల తయారీ కంపెనీ మారుతీ సుజుకీ కార్ల ధరలను ఫిబ్రవరి 1 నుంచి పెంచనుంది. కారు మోడల్ ఆధారంగా ఈ పెంపు అత్యధికంగా 32,500 రూపాయల వరకు ఉంటుంది. ఉత్పత్తి వ్యయం పెరినందునే వాహనాల ధరలు పెంచాల్సి వచ్చిందని మారుతీ సుజుకీ తెలిపింది. మోడల్‌ను బట్టి కార్ల ధరలు ఉంటాయని పేర్కొంది.
కంపెనీ కంఫాక్ట్ కారు సెలెరియో మోడల్‌పై 32,500 రూపాయలు, ఇన్విక్టో ప్రీమియం మోడల్‌పై 30 వేల రూపాయలు పెంపు ఉంటుందని తెలిపింది.
కంపెనీ పాపులర్ మోడల్ వ్యాగన్‌ఆర్ పై 15 వేలు, స్విఫ్ట్‌పై 5 వేలు, ఎస్‌యూవీ బ్రిజాపై 20 వేలు, విటారాపై 25 వేలు, ఆల్టో కే10పై 19,500 రూపాయలు, ఎస్-ప్‌రెసో 5 వేల రూపాయల వరకు పెరగనున్నాయి.
ఇక ప్రీమియం కాంపాక్ట్ మోడల్ బాలెనోపై 9 వేలు కాంపాక్ట్ ఎస్‌యూవీ ఫ్రాంక్స్‌పై 5,500, డిజైర్ పై 10 వేల రూపాయల వరకు పెంపు ఉంటుందని కంపెనీ తెలిపింది.
ఆల్టోకే 10, ఇన్విక్టో వరకు 3,99 లక్షల నుంచి 28.92 లక్షల వరకు వివిధ మోడళ్ల కార్లను మారుతీ సుజుకీ విక్రయిస్తోంది. 2024 డిసెంబర్‌లో మారుతీ సుజుకీ 1,78,248 కార్లను విక్రయించింది. అంతకు ముందు సంవత్సరం ఇదే నెలతో పోల్చితే అమ్మకాలు 30 శాతం పెరిగాయి.