Saturday, November 23, 2024

మార్కెట్‌లోకి మారుతీ సుజుకీ ఇన్విక్టో.. కంపెనీలో ఇదే ఖరీదైన కారు

హైబ్రీడ్‌ కార్ల మార్కెట్‌లో వాటా పెంచుకునేందుకు మారుతీ సుజుకీ మరో కొత్త కారును మార్కెట్‌లోకి తీసుకు వచ్చింది. స్ట్రాంగ్‌ హైబ్రీడ్‌ విభాగంలో కంపెనీ ఇన్విక్టో పేరుతో రెండో కారును బుధవారం నాడు మార్కెట్‌లోకి తీసుకు వచ్చింది. జూన్‌ 19 నుంచి మారుతీ సుజుకీ ఇన్విక్టోకు బుకింగ్స్‌ తీసుకుంటున్నది. మారుతీ సుజుకీ కంపెనీ కార్లలో ఇన్విక్టోనే ఎక్కువ ఖరైదనది. మూడు వరసల్లో 7 సీట్లున్న ఈ కారు జెటా ప్లస్‌ ఎక్స్‌షోరూమ్‌ ధర 24.79 లక్షలు, జెటా ప్లస్‌ 8 సీటర్‌ ధర 24.84 లక్షలు, ఆల్ఫాప్లస్‌ 7 సీటర్‌ దర 28.42 లక్షలకు అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపిింది. ఈ కారును మారుతీ సబ్‌స్రె ్కబ్‌లో కూడా నెలవారీ ఫీజు 61,860 రూపాయలతో అందుబాటులో ఉంటుంది. ఇన్విక్టో 4,755 ఎంఎం పొడవు, 1859 ఎంఎం వెడల్పు, 1795 ఎంఎం ఎత్తు ఉటుంది. నెక్సా బ్లూ, మిస్టిక్‌ వైట్‌, సిల్వర్‌, స్టెల్లార్‌ బ్రాంజ్‌ రంగుల్లో అభిస్తుంది.

- Advertisement -

ఇన్విక్టోలో ఇంటెలిజెంట్‌ ఎలక్ట్రిక్‌ హైబ్రిడ్‌ సిస్టమ్‌తో 2.0లీటర్‌ ఇంజిన్‌, 10.1 అంగుళా స్మార్ట్‌ ప్లే మాగ్నమ్‌ ప్లస్‌, డ్రైవ్‌ మోడ్‌ కలర్‌ థీమ్‌లతో కూడిన 7 అంగుళాల మల్ట ఇన్ఫోటైన్‌మెర్‌, ఆరు ఎయిర్‌ బ్యాగ్‌లు, నెక్ట్‌ ్సజెన్‌ సుజుకీ కనెక్ట్‌ నుంచి 50 ఫీచర్లు ఉంటాయి. హిల్‌హోల్డ్‌ అసిస్ట్‌, టీపీఎంఎస్‌ డ్యుయల్‌ జోన్‌ క్లైయింట్‌ కంట్రోల్‌, 360 డిగ్రీ వ్యూ మానిటర్‌, సన్‌ రూప్‌ వంటి అనేక ఫీచర్లు ఉన్నాయి. మారుతీ సుజుకీ తొలిసారి ఎలక్ట్రానిక్‌ పార్కింగ్‌ బ్రేక్‌ ఫీచర్‌, మెమొరీ ఆధారంగా పని చేసే డ్రైవర్‌సీట్‌ను ఈ కారులో అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఇన్విక్టోకు ఇప్పటికే 6 వేలకు పైగా బుకింగ్స్‌ వచ్చాయి.

కంపెనీ కొత్తగా మార్కెట్‌లోకి తీసుకు వచ్చిన గ్రాండ్‌ విటారా, ఫ్రాంక్స్‌, జిమ్నీ తో అమ్మకాలు స్థిరంగా పెరుగుతున్నాయని కంపెనీ తెలిపింది. కార్బన్‌ న్యూట్రాలిటీకి మారుతీ సుజుకీ కట్టుబడి ఉందని పేర్కొంది. 2030-31 నాటికి కంపెనీ మొత్తం ఆరు ఎస్‌యూవీలను మార్కెట్‌లో తీసుకు రానుందని తెలిపింది. యూవీ విభాగంఓ మారుతీ ఆరు సంవత్సరాలుగా మార్కెట్‌ లీడర్‌గా ఉందని, ప్రధానంగా బ్రెజా, ఎర్టిగా, ఎక్స్‌ఎల్‌6 కార్లు బ్రాండ్‌ను నిలబెట్టాయని కంపెనీ మార్కెటింగ్‌ సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ శశాంక్‌ శ్రీవాస్తవ తెలిపారు. సుజుకీ-టయోటా కంపెనీల భాగస్వామ్యంతో ఇప్పటికే మార్కెట్‌లో గ్లాంజా, అర్బన్‌ క్రూజర్‌, గ్రాండ్‌ విటారాలను తీసుకు వచ్చారు. తాజాగా ఇన్నోవా హైక్రాస్‌ కారునే మారుతీ సుజుకీ రీబ్యాడ్జ్‌ చేసి ఇన్విక్టోగా తీసుకు వచ్చింది. దీని అమ్మకాలు భారీగా ఉంటాయని కంపెనీ భావిస్తోంది. ఇన్విక్టో కారును మారుతీ సుజుకీ కంపెనీ ఎండీ, సీఈఓ హిసాషీ టకేయుచి మార్కెట్‌లోకి విడుదల చేశారు

Advertisement

తాజా వార్తలు

Advertisement