Sunday, November 24, 2024

Maruti Suzuki | కార్ల ధరలు పెంచిన మారుతీ సుజుకీ

మారుతీ సుజుకీ కొన్ని కార్ల ధరలను పెంచింది. స్విఫ్ట్‌తో పాటు ఎస్‌యూవీ గ్రాండ్‌ విటారాలో ఎంపిక చేసిన వెరియంట్స్‌ ధరలను పెంచుతున్నట్లు తెలిపింది. పెంచిన ధరలు ఏప్రిల్‌ 10 నుంచే అమల్లోకి వస్తాయని తెలిపింది. స్విఫ్ట్‌ వాహన ధరను 25,000, గ్రాండ్‌ విటారా సిగ్మా వేరియంట్‌ ధరను 19,000 రూపాయలు పెంచినట్లు ప్రకటించింది.

ఈ జనవరిలో మారుతీ అన్ని కార్ల ధరలను 0.45 శాతం పెంచింది. నిర్వహణ వ్యయాలు, ముడి సరకుల ధరల పెరగడంతో ధరలు పెంచినట్లు తెలిపింది. స్విఫ్ట్‌ ధరల 5.99 లక్షల నుంచి 8.89 లక్షల వరకు ఎక్స్‌షోరూమ్‌ ధరలు ఉన్నాయి. గ్రాండ్‌ విటారా సిగ్మా వేరియంట్‌ ధర 10.8 లక్షలుగా ఉంది.

భారత్‌ ఎన్‌క్యాప్‌ రేటింగ్‌కు…

మారుతీ సుజుకీ కొన్ని కార్లను భారత్‌-ఎన్‌క్యాప్‌ రేటింగ్స్‌ కోసం పంపించింది. అడల్ట్‌, చైల్డ్‌ సెఫ్టీ విభాగంలో భారత్‌ ఎన్‌క్యాప్‌ పరీక్షించి కార్లకు రేటింగ్‌ ఇస్తోంది. భారత్‌ ఎన్‌-క్యాప్‌ అమల్లోకి వచ్చిన తరువాత మొదటిసారి టాటా మోటార్స్‌కు చెందిన సఫారీ, హరియర్‌ వేరియంట్స్‌ను టెస్ట్‌కు పంపించింది. తాజాగా మారుతీ సుజుకీ కూడా ఇదే రేటింగ్‌ టెస్ట్‌కు పంపించింది. గత సంవత్సరం ఆగస్టులోనే ప్రభుత్వం భారత్‌-ఎన్‌క్యాప్‌ను ప్రారంభించింది. మారుతీ సుజుకీ ఏ మోడల్స్‌ను ఈ టెస్ట్‌కు పంపించిందన్న విషయాన్ని వెల్లడించలేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement