మారుతీ సుజుకీ మల్టి పర్పస్ వెహికల్ (ఎంపీవీ) ఎర్టిగా 10 లక్షల యూనిట్ల అమ్మకాల మైలురాయిని అధిగమించింది. ఎంపీవీ కాన్సెఫ్ట్ ఎర్టిగా పునర్విచించిందని, టెక్నాలజీ పరంగా ఎంతో అడ్వాన్స్‌గా ఎర్టిగా ఉందని మారుతీ సుజుకీ మార్కెటింగ్, సేల్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శశాంక్ శ్రీవాస్తవా చెప్పారు. ఎర్టిగా ఈ విభాగంలో 37.5 శాతం మార్కెట్ వాటా కలిగి ఉంది. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో అన్నింటిలోనూ ఎర్టిగా బాగా పాపులర్ అని ఆయన తెలిపారు. దేశీయంగా అమ్మకాలతో పాటు ఎర్టిగాను 80 దేశాలకు కంపెనీ ఎగుమతి చేస్తోంది.
కంపెనీ ఎర్టిగాను 2012లో మొదటిసారి లాంచ్ చేసింది. దీని కొత్త వెర్షన్‌ను 2018లో తీసుకు వచ్చింది. తరువాత నెక్స్ జెన్ ఎర్టిగాను కంపెనీ 2022లో విడుదల చేసింది. నెక్స్-జెన్ ఎర్టిగా ప్రారంభ ధర 8.69 లక్షల రూపాయలు. 2020 నాటికి మారుతీ సుజుకీ ఎర్టిగా 6 లక్షల యూనిట్ల అమ్మకాలు జరిపింది. 2024 నాటికి 10 లక్షల యూనిట్ల విక్రయాలతో రికార్డు సృష్టించింది. ఎర్టిగా 1.5 లీటర్ల పెట్రోల్ ఇంజిన్‌తో లబిస్తుంది. ఇందులో మాన్యువల్, ఆటోమెటిక్ వెర్షన్లు ఉన్నాయి. కంపెనీ ఎర్టిగాలో సీఎన్జీ వెర్షన్‌ను కూడా తీసుకు వచ్చింది. హైబ్రీడ్ టెక్నాలజీతో సిక్స్ స్పీడ్ ఆటోమెటిక్ ట్రాన్స్మిషన్స్ కలిగి ఉంది. ఈ కారు లీటర్ పెట్రోల్‌కు 20.51 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది. సీఎన్జీ వెర్షన్ ఒక కేజీకి 26.11 కిలీమీటర్ల మైలేజీ ఇస్తుంది.