ప్రభన్యూస్ : ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన ఇండియన్ బ్యాంక్‌తో మారుతీ సుజుకీ ఒప్పందం కుదుర్చుకుంది. వినియోగదారులకు కారు రుణ పథకాలను అందించడానికి మారుతీ సుజుకీ ఈ ఒప్పందం కుదుర్చుకుంది. దీనిలో భాగంగా కారు రుణానికి జీరో ప్రాసెసింగ్ ఫీజు, ఉచితఫాస్టాగ్ తదితరాలు వినియోగదారులుకు అందించనున్నారు. ఆకర్షణీయమైన ఫైనాన్సింగ్‌ను సులభతరం చేసేందుకు మారుతీ సుజుకీకి ఇండియన్ బ్యాంక్‌తో ఒప్పందం సహకరించనుంది. కాగా మారుతీ సుజుకీ కంపెనీ కార్లను కొనుగోలు చేసే వినియోగదారులు దేశవ్యాప్తంగా ఉన్న ఇండియన్ బ్యాంకుకు చెందిన 5,700కుపైగా శాఖల ద్వారా రుణ ప్రయోజనాలు పొందే అవకాశం ఉంటుంది.
ఆన్‌రోడ్ ధరలో 90శాతం వరకు ఇండియన్ బ్యాంక్ ద్వారా రుణం పొందవచ్చు. అదేవిధంగా కొనుగోలుదారులకు రూ.30లక్షలు వరకు ఉచిత ప్రమాద బీమా రక్షణ ప్రయోజనాలను అందించనున్నారు. రుణ చెల్లింపుల కోసం 84నెలల వరకు కాలపరిమితిని ఎంచుకోవచ్చు. ఈ పథకం 2022 జూన్ 30వరకు మాత్రమే అందుబాటులో ఉండనుంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..