Tuesday, November 26, 2024

నష్టాల్లో ముగిసిన మార్కెట్లు..

స్టాక్‌ మార్కెట్లు మంగళవారం నాడు స్వల్ప నష్టాల్లో ముగిశాయి. ఉదయం నష్టాలతోనే ప్రారంభమైనప్పటికీ , మధ్యాహ్నం సమయానికి కొద్ది సేపు లాభాల్లోకి వచ్చింది. ఇంట్రాడేలో అమ్మకాల ఒత్తిడితో మళ్ళీ నష్టాల్లోకి వెళ్లింది. సోమవారంతో పోల్చితే పరిమితంగా మార్కెట్లు నష్టపోయాయి. ప్రతికూలంగా ఉన్న అంతర్జాతీయ పరిస్థితులు మార్కెట్లపై ప్రభావం చూపాయి. ఆసియా-పసిఫిక్‌ మార్కెట్లు కూడా నష్టాల్లోనే ముగిశాయి. ఐటీ, మెటల్‌, ఫార్మా స్టాక్స్‌ మార్కెట్లు మరింత పతనం కాకుండా అడ్డుకున్నాయి. హోల్‌ సేల్‌ ప్రైస్‌ ఇండెక్స్‌ ద్రవ్యోల్బణం 15.8 శాతానికి చేరిందన్న వార్తలు మార్కెట్‌ను ప్రభావితం చేశాయి.
సెన్సెక్స్‌ 153.13 పాయింట్ల నష్టంతో 52693.57 వద్ద ముగిసింది. నిఫ్టీ 42.30 పాయింట్ల నష్టంతో 15732.10 వద్ద ముగిసింది.

ఎన్‌టీపీసీ, అల్ట్రాటెక్‌ సిమెంట్స్‌, భారతీ ఎయిర్‌ టెల్‌, ఇన్ఫోసిస్‌, డాక్టర్‌ రెడ్డీస్‌, ఎల్‌ అండ్‌ టీ, పవర్‌ గ్రీడ్‌, హెచ్‌సిఎల్‌ టెక్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, టాటా స్టీల్‌ షేర్లు లాభాల్లో ముగిశాయి. ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, టెక్‌ మహీంద్రా, రిలయన్స్‌, మారుతి, హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌యూఎల్‌, ఏషియన్‌ పెయింట్స్‌, సన్‌ ఫార్మా షేర్లు నష్టాల్లో ముగిశాయి. బంగారం 10 గ్రాముల ధర 334 రూపాయిలు తగ్గి 50330 వద్ద నిలిచింది. వెండి కిలో 460 తగ్గి 59851 వద్ద ముగిసింది. డాలర్‌తో రూపాయి విలువ 78.01 గా ట్రేడ్‌ అయ్యింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement