Thursday, November 21, 2024

భారీ లాభాల్లో ముగిసిన మార్కెట్లు

నేష‌న‌ల్‌ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లు సానుకూలంగా ఉండటం ఇన్వెస్టర్ల సెంటిమెంటును బలపరిచింది. ఐటీ, మెటల్ స్టాకులు మార్కెట్లను ముందుండి నడిపించాయి. దీంతో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 497 పాయింట్లు లాభపడి 56,319కి పెరిగింది. నిఫ్టీ 157 పాయింట్లు పుంజుకుని 16,771 వద్ద స్థిరపడింది. అన్ని సూచీలు లాభాల్లో ముగిశాయి.

టాప్ గెయినర్స్:
హెచ్సీఎల్ టెక్నాలజీస్ (3.91%), విప్రో లిమిటెడ్ (3.66%), టాటా స్టీల్ (2.98%), టైటాన్ కంపెనీ (2.35%), టెక్ మహీంద్రా (2.29%).

టాప్ లూజర్స్:
పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (-1.50%), యాక్సిస్ బ్యాంక్ (-1.31%), బజాజ్ ఫైనాన్స్ (-0.82%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-0.75%), మహీంద్రా అండ్ మహీంద్రా (-0.58%).

Advertisement

తాజా వార్తలు

Advertisement