Thursday, November 21, 2024

Business: భారీ నష్టాల్లో మార్కెట్లు, సెన్సెక్స్‌ 500 పాయింట్లకు పైగా నష్టం

స్టాక్‌ మార్కెట్లు ఉదయం నష్టాలతో ప్రారంభమై రోజంతా అలాగే కొనసాగాయి. చివరిలో అమ్మకాలు భారీగా జరగడంతో సూచీలు కనిష్టాల వద్ద స్థిరపడ్డాయి. అంతర్జాతీయంగా ప్రతికూల వార్తలు, ద్రవ్యోల్బణం, మాంధ్యం భయాలకు తోడు రూపాయి పతనం .. ఇలా పలు కారణాలతో మార్కెట్లు నష్టాలను ఎదుర్కొన్నాయి. జూన్‌లో ద్రవ్యోల్బణం 7 శాతానికి పైగానే నమోదు కావడం మార్కెట్‌ సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. బీఎస్‌సీ సెన్సెక్స్‌ 508.62 పాయింట్ల నష్టపోయి 53886.61 వద్ద ముగిసింది. నిఫ్టీ 157.70 పాయింట్లు నష్టపోయి 16058.30 వద్ద ముగిసింది. బంగారం 10 గ్రాముల ధర 76 రూపాయలు తగ్గి 50568 వద్ద ట్రేడ్‌ అయ్యింది. వెండి కేజీ 650 రూపాయలు తగ్గి 56275 వద్ద ట్రేడ్‌ అయ్యింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 79.12 రూపాయిలుగా ఉంది.

లాభపడిన షేర్లు ఎన్‌టీపీసీ, భారతీ ఎయిర్‌టెల్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, అదానీ ఫోర్ట్స్‌, శ్రీ సిమెంట్‌ షేర్లు ఉన్నాయి.
నష్టపోయిన షేర్లు ఇన్ఫోసిస్‌, నెస్లీ ఇండియా, పవర్‌ గ్రీడ్‌ కార్పోరేషన్‌, హిందుస్థాన్‌ యూనీలివర్‌. మహీంద్రా అండ్‌ మహీంద్రా, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, ఏషియన్‌ పేయింట్స్‌, ఇండాల్కో షేర్లు ఉన్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement