ముంబై : దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం భారీ నష్టాల్లోనే ముగిశాయి. ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమైన సూచీలు.. తరువాత మధ్యాహ్నం వరకు ఊగిసలాటలో కనిపించాయి. మధ్యాహ్నం తరువాత నష్టాల్లోకి జారుకున్నాక.. మళ్లిd లాభాల్లోకి రాలేవు. సెన్సెక్స్ ఉదయం 54,254.07 పాయింట్ల వద్ద ప్రారంభమై.. 54,379.59 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 53,683.16 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ 16,196.35 పాయింట్ల వద్ద ప్రారంభమై.. 16,223.35 పాయిట్ల వద్ద గరిష్టాన్ని, 16,006.95 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. చివరికి సెన్సెక్స్ 303.35 (0.56 శాతం) పాయింట్లు, నిఫ్టీ 99.35 పాయింట్లు (0.62 శాతం) నష్టపోయి.. 16,025.80 పాయింట్ల వద్ద ముగిసింది.
బ్యాంకింగ్ మినహా అన్ని నష్టాలే..
బ్యాంకింగ్ రంగం మినహా మిగిలిన అన్ని రంగాలు నష్టాల్లో ముగిశాయి. ఐటీ స్టాక్స్ మార్కెట్‌ను భారీ నష్టాల్లోకి నెట్టేసింది. ఆయిల్ అండ్ గ్యాస్, మెటల్, ఫార్మా, రియాల్టి, క్యాపిటల్ గూడ్స్, ఐటీ సూచీలు 1 శాతం నుంచి 3 శాతం వరకు నష్టపోయాయి. నేటి టాప్ గెయినర్స్ జాబితాలో ఎన్‌టీపీసీ, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, భారతీ ఎయిర్‌టెల్, హెచ్‌డీఎఫ్‌సీ ఉన్నాయి. టాప్ లూజర్స్ జాబితాలో ఏషియన్ పెయింట్స్, అదానీ పోర్ట్ , దివిస్ ల్యాబ్స్, టీసీఎస్, యూపీఎల్ ఉన్నాయి. ఐటీ సూచీలు 3 శాతం క్షీణించగా.. మార్కెట్లు వరుసగా మూడో రోజు నష్టపోయాయి. చక్కెర ఎగుమతులపై ఆంక్షలు విధించిన నేపథ్యంలో ఈ రంగంలో భారీ అమ్మకాలు జరిగాయి.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..