అమెరికా ఫెడరల్ బ్యాంక్ వడ్డీరేట్లను 75 బేసిస్ పాయింట్లు పెంచిన నేపథ్యంలో మార్కెట్లు నేలచూపులు చూశాయి. సెన్సెక్స్ 69.68 పాయింట్ల పతనమై 60,836.41 పాయింట్లవద్ద స్థిరపడగా నిఫ్టీ 30.15 పాయింట్లు (0.17) పతనమై 18,052.70 పాయింట్లవద్ద స్థిరపడింది. కాగా గురువారం లావాదేవీల్లో టెక్ మహీంద్ర (2.66 శాతం), పవర్ గ్రిడ్ (2.04శాతం), ఎన్టీపీసీ (1.47 శాతం), ఇన్ఫోసిస్ (1.41 శాతం), విప్రో (1.33 శాతం) నష్టపోగా, ఎస్బీఐ (1.8 శాతం), టైటాన్ (1.53), భారతీ ఎయిర్ టెల్ (1.05), టాటా స్టీల్ (0.99), హిందూస్తాన్ యూనిలీవర్ (0.95) లాభపడ్డాయి. కాగా బీఎస్ఈ మిడ్, స్మాల్ కేపిటల్స్ వరుసగా 55, 32 పాయింట్ల చొప్పున లాభపడింది. ఐటీ, ఆటో రంగాల షేర్ల భారీగా ఫతనమైనాయి.
Advertisement
తాజా వార్తలు
Advertisement