ఆర్థిక మాంధ్యం భయాలతో మన మార్కెట్లు భారీగా పతనం అయ్యాయి. ఈ వారం చివరి రోజున సూచీలు నష్టాలతో ముగించాయి. అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్ని ప్రతికూల పరిస్థితులతో దేశీయ మార్కెట్లు ప్రభావితం అయ్యాయి. మార్కెట్లు ప్రారంభం నుంచే నష్టాల్లో కదలాడాయి. ఏ దశలోనూ మార్కెట్లలో కొనుగోళ్ల మద్దతు లభించలేదు. వరసగా మూడు రోజులుగా మార్కెట్లు నష్టాల్లోనే ముగిశాయి. మూడు రోజుల్లో సెన్సెక్స్ 1730 పాయింట్లు, నిఫ్టీ 539 పాయింట్లు నష్టపోయింది. సెన్సెక్స్ 1093.79 పాయింట్లు నష్టపోయి 58840.79 వద్ద ముగిసింది. నిఫ్టీ 346.55 పాయింట్లు నష్టపోయి 17530.85 వద్ద ముగిసింది. బంగారం 10 గ్రాముల ధర 131 రూపాయలు తగ్గి 49181 వద్ద ట్రేడయ్యింది. వెండి కిలో 606 రూపాయలు తగ్గి 55811 వద్ద ట్రేడయ్యింది. డాలర్‌తో రూపాయి మారకపు విలువ 79.40 రూపాయలుగా ఉంది.
లాభపడిన షేర్లు
సెన్సెక్స్ 30 సూచీలో కేవలం ఇండస్ ఇండ్ బ్యాంక్, సిప్లా షేర్లు మాత్రమే లాభాల్లో ముగిశాయి. నష్టపోయిన షేర్లు యాక్సిస్ బ్యాంక్, మారుతి సుజుకీ, జేఎస్‌బడ్ల్యూ స్టీల్, భారతీ ఎయిర్‌టెల్, సన్ ఫార్మా, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, ఆల్ట్రాటెక్ సిమెంట్స్, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, ఎం అండ్ ఎం, విప్రో, టీసీఎస్, నెస్లే , రిలయన్స్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్, ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఫిన్‌సర్వ్, హెచ్‌సిఎల్ షేర్లు నష్టాల్లో ముగిశాయి.