స్టాక్‌మార్కెట్లు వరసగా నాలుగో రోజు లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూలతతో మన మార్కెట్లు ప్రారంభం నుంచి లాభాల్లోనే కొనసాగాయి. అన్ని ప్రధాన షేర్లలో కొనుగోళ్ల మద్దతు లభించింది. మంగళవారం నాడు నిఫ్టీ 18000 కీలకమైన మైలురాయిని అధిగమించింది. చమురు ధరలు తగ్గడం, రూపాయి బలపడటంతో మార్కెట్లకు కలిసి వచ్చింది. బ్యాంకింగ్, ఆర్ధిక రంగ షేర్లు రాణించాయి.
సెన్సెక్స్ 455.95 పాయింట్లు లాభంతో 60571.08 వద్ద ముగిసింది. నిఫ్టీ 133.70 పాయింట్ల లాభంతో 18070.05 వద్ద ముగిసింది.
బంగారం 10 గ్రాముల ధర 481 రూపాయలు తగ్గి 50150 వద్ద ట్రేడయ్యింది. వెండి కిలో 389 రూపాయలు తగ్గి 57102 వద్ద ట్రేడయ్యింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 79.49 రూపాయలుగా ఉంది.
లాభపడిన షేర్లు..
బజాజ్ ఫిన్‌సర్వ్, ఇండస్ ఇండ్ బ్యాంక్, భారతీ ఎయిర్‌టెల్, టైటాన్ కంపెనీ, బజాజ్ ఫైనాన్స్, ఎల్ అండ్ టీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, బ్రిటానియా ఇండస్ట్రీస్ షేర్లు లాభపడ్డాయి.
నష్టపోయిన షేర్లు..
సిమెంట్, సిప్లా, ఐచర్ మెటార్స్, బీపీసీఎల్, టీసీఎస్, ఏషియన్ పెయింట్స్, దివిస్ ల్యాబ్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్, టెక్ మహీంద్రా, కొటక్ మహీంద్రా బ్యాంక్ , మారుతి సుజుకీ షేర్లు నష్టపోయాయి.