Saturday, November 23, 2024

లాభాలకు బ్రేక్.. నష్టాలతో ముగిసిన స్టాక్స్

దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో రోజు నష్టాలను మూటగట్టుకున్నాయి. ఈరోజు ప్రారంభం నుంచి మార్కెట్లు లాభాల్లోనే కొనసాగాయి. అయితే బ్యాంకింగ్, ఫైనాన్స్ స్టాకులు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కోవడంతో మార్కెట్లు నష్టపోయాయి. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ సహా ఐటీ రంగ షేర్లు రాణించడంతో సూచీలు మధ్యాహ్నం వరకు లాభాల్లో కొనసాగాయి. కానీ, చివర్లో విద్యుత్తు, బ్యాంకింగ్‌, ఆర్థిక రంగ షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తడంతో ఒక్కసారిగా నష్టాల్లోకి జారుకున్నాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 66 పాయింట్లు కోల్పోయి 52,482కి పడిపోయింది. నిఫ్టీ ఇంట్రాడేలో 91 పాయింట్ల వరకు లాభపడినప్పటికీ, మళ్ళీ 15,800 పాయింట్ల స్థాయికి దిగి వచ్చింది.

ఇది కూడా చదవండి: కేసీఆర్ దిగిపోతే రాష్ట్రంలో సమస్యలు కూడా తొలగిపోతాయి: రేవంత్ రెడ్డి

Advertisement

తాజా వార్తలు

Advertisement