దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారాన్ని నష్టాల్లో ముగించాయి. అంతర్జాతీయ సానుకూలతలు లేకపోవడంతో పాటు బ్యాంకింగ్, ఫైనాన్స్ స్టాకులు నష్టపోవడంతో మార్కెట్లు పతనమయ్యాయి. అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలు సూచీలపై ప్రభావం చూపాయి. పలు దేశాల్లో కొవిడ్-19 డెల్టా వేరియంట్ కేసులు పెరగడంతో పాటు రేట్ల పెంపుపై అమెరికా ఫెడరల్ రిజర్వు వ్యాఖ్యలు అంతర్జాతీయ సూచీలను కలవరపెట్టాయి. వీటికి తోడు బాండ్ల రాబడులు పెరగడం సూచీల నేలచూపులకు కారణమైంది. దీంతో బ్యాంకింగ్, ఆర్థిక, స్థిరాస్తి, ఆటో రంగాల షేర్ల్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. ఓ దశలో సెన్సెక్స్ 52,228 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. నిఫ్టీ సైతం ఇదే ట్రెండ్‌ను కొనసాగించింది. ఈ పరిణామాల నేపథ్యంలో చివరకు సెన్సెన్స్ 182 పాయింట్లు నష్టపోయి 52,386 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 38 పాయింట్లు దిగజారి 15,689 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.60 వద్ద నిలిచింది.
ఇది కూడా చదవండి: దేశంలో కరోనా ‘కప్పా వేరియంట్’