Friday, November 22, 2024

నష్టాల్లో ముగిసిన మార్కెట్లు..

దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు నష్టాల్లో ముగిశాయి. ఉదయం ఊగిసలాట మధ్య ట్రేడింగ్‌ ప్రారంభించిన సూచీలు కాసేపటికే నష్టాల్లోకి జారుకుని.. ఏ దశలోనూ కోలుకోలేకపోయాయి. ఆసియా మార్కెట్లు డీలా పడడంతో కుంగిన సూచీలకు ఎక్కడా మద్దతు లభించలేదు.అంతేకాదు బ్యాంకింగ్ షేర్లు అమ్మకాల ఒత్తిడికి గురి కావడంతో మార్కెట్లు పతనమయ్యాయి. కీలక రంగాల్లో అమ్మకాలు కొనసాగాయి. కేంద్రం సోమవారం ప్రకటించిన ఉపశమన కార్యక్రమాలు మార్కెట్లలో ఉత్సాహం నింపలేకపోయాయి. ఈ పరిణామాల నేపథ్యంలో సెన్సెక్స్ చివరకు 185 పాయింట్ల నష్టంతో 52,549 వద్ద.. నిఫ్టీ 66 పాయింట్లు నష్టపోయి 15,748 వద్ద స్థిరపడ్డాయి. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.29 వద్ద నిలిచింది.

ఇది కూడా చదవండి: విజయనగరంలో డెల్టా ప్లస్ వైరస్..!

Advertisement

తాజా వార్తలు

Advertisement