Monday, November 18, 2024

లాభాలకు బ్రేక్.. నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాలను మూటకట్టుకున్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి హెవీ వెయిట్ కంపెనీలు నష్టాల బారిన పడటం మార్కెట్లపై ప్రభావం చూపింది.  ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 271 పాయింట్లు నష్టపోయి 52,501కి పడిపోయింది. నిఫ్టీ 101 పాయింట్లు కోల్పోయి 15,767కి దిగజారింది. లోహ, ఇన్‌ఫ్రా రంగాల షేర్లు కుదేలవడంతో పాటు రిలయన్స్ వంటి దిగ్గజ సంస్థల షేర్లు వెనుకబడడంతో స్టాక్ మార్కెట్‌ సూచీలు నష్టాల్లో ముగిశాయిలోహ, ఇన్‌ఫ్రా రంగాల షేర్లు కుదేలవడంతో పాటు రిలయన్స్ వంటి దిగ్గజ సంస్థల షేర్లు వెనుకబడడంతో బుధవారం స్టాక్ మార్కెట్‌ సూచీలు నష్టాల్లో ముగిశాయి. దీంతో గత నాలుగు సెషన్ల వరుస లాభాలకు బ్రేక్‌ పడింది. అంతర్జాతీయంగా ఎలాంటి బలమైన సంకేతాలు లేకపోవడంతో పాటు ఆసియా మార్కెట్లు అప్రమత్తంగా కదలాడడం సూచీలను కిందకు దిగజార్చింది. ఉదయం ఫ్లాట్‌గా ప్రారంభమైన సూచీలు సమయం గడుస్తున్న కొద్దీ అంతకంతకు దిగజారుతూ పోయాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement