స్టాక్ మార్కెట్లు భారీ లాభాలను మూటగట్టుకున్నాయి. ఆరంభం నుంచి లాభాల్లో ట్రేడ్ అయిన మార్కెట్లు అదే జోరును కొనసాగించాయి. ఒకానొక సమయంలో సెన్సెక్స్ 243 పాయింట్లు లాభపడి రికార్డు స్థాయిలో 55,680కి చేరుకుంది. అయితే ఆ తర్వాత ఇన్ఫోసిస్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మారుతి సుజుకి, ఐసీఐసీఐ బ్యాంక్ తదితర కంపెనీల షేర్లు అమ్మకాల ఒత్తిడికి గురికావడంతో లాభాలు కొంతమేర తగ్గాయి. చివరకు ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 145 పాయింట్లు లాభపడి 55,582కి చేరుకుంది. నిఫ్టీ 34 పాయింట్లు పెరిగి 16,563 వద్ద స్థిరపడింది. ఇక మార్కెట్లో భారీ లాభలను ముటగట్టుకున్న కంపెనీల్లో టాటా స్టీల్ (3.67%), బజాజ్ ఫైనాన్స్ (3.48%), మహీంద్రా అండ్ మహీంద్రా (2.60%), బజాజ్ ఫిన్ సర్వ్ (1.33%), హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (0.88%) ఉన్నాయి. టాప్ లూజర్స్:
మారుతి సుజుకి (-2.49%), బజాజ్ ఆటో (-2.08%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (-2.00%), అల్ట్రాటెక్ సిమెంట్ (-1.53%), భారతి ఎయిర్ టెల్ (-0.64%) ఉన్నాయి.
ఇది కూడా చదవండి: ప్రభుత్వ ఉద్యోగులకు దళిత బంధు