దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు రికార్డు స్థాయిలో దూసుకుపోయాయి. అంతర్జాతీయంగా సానుకూలతలు ఉండటం ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను బలపరిచింది. దీంతో స్టాక్ మార్కెట్లో సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు సరికొత్త రికార్డులను సృష్టించాయి. సెన్సెక్స్ ఒకానొక సమయంలో 1,030 పాయింట్లు పెరిగింది. రుతు పవనాల పురోగతి, వ్యాక్సినేషన్ల వేగం వంటి సానుకూల పరిణామాల నేపథ్యంలో సూచీలు దూసుకెళ్లినట్లు ఎల్కెపీ సెక్యూరిటీస్ రీసెర్చ్ హెడ్ ఎస్ రంగనాథన్ పేర్కొన్నారు. అలాగే, సానుకూల ప్రపంచ సూచనల మధ్య సూచీలు రికార్డు స్థాయిలలో ముగిశాయి. ఈరోజు ముఖ్యంగా ఫైనాన్స్, బ్యాంకింగ్ షేర్లు ఈ రోజు అద్భుతమైన ప్రదర్శనను కనపరిచాయి చివరకు, సెన్సెక్స్ 958.03 పాయింట్లు (1.63%) పెరిగి 59,885.36 వద్ద స్థిరపడితే, నిఫ్టీ 276.30 పాయింట్లు (1.57%) పెరిగి 17,823 వద్ద ముగిసింది. నేడు సుమారు 1866 షేర్లు అడ్వాన్స్ అయితే, 1305 షేర్లు క్షీణించాయి, 148 షేర్లు మారలేదు. నేడు డాలరుతో రూపాయి మారకం విలువ 73.72గా నమోదైంది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
బజాజ్ ఫిన్ సర్వ్ (5.15%) ఎల్ అండ్ టీ (3.46%), హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (3.11%), యాక్సిస్ బ్యాంక్ (3.04%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (2.46%).
టాప్ లూజర్స్:
డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ (-1.09%), ఐటీసీ (-0.41%), నెస్లే ఇండియా (-0.38%), హిందుస్థాన్ యూనిలీవర్ (-0.11%), భారతి ఎయిర్ టెల్ (-0.08%).
ఇది కూడా చదవండి: లేడీస్ బాత్ రూంలో కెమెరా.. బ్లాక్ మేయిల్ చేశాడా?