స్టాక్ మార్కెట్లు సోమవారం నాడు భారీ లాభాల్లో ముగిశాయి. సూచీలు మరోసారి 60 వేల మార్క్‌ను దాటాయి. దేశీయంగా స్థూల ఆర్థిక గణాంకాలు సానుకూలంగా ఉండటంతో మార్కెట్లలో ఉత్తేజం నెలకొంది. ఉదయం నుంచే సూచీనలు లాభాల్లో ట్రేడయ్యాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గడం కూడా కలిసి వచ్చింది. దిగ్గజ సంస్థల షేర్లు కొనుగోళ్ల మద్దతుతో మార్కెట్ లాభాలు ఆర్జించింది. సెన్సెక్స్ 321.99 పాయింట్లు లాభంతో 60115.13 వద్ద ముగిసింది. నిఫ్టీ 103 పాయింట్ల లాభంతో 17936.35 వద్ద ముగిసింది. బంగారం 10 గ్రాముల ధర 194 రూపాయలు పెరిగి 50723 వద్ద ట్రేడయ్యింది. వెండి కిలో 2094 రూపాయలు పెరిగి 57144 వద్ద ట్రేడయ్యింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 79.59 రూపాయలుగా ఉంది.
లాభపడిన షేర్లు..
టైటాన్ కంపెనీ, యాక్సిస్ బ్యాంక్, టెక్ మహీంద్రా, టాటా స్టీల్, ఇన్ఫోసిస్, బజాజ్ ఫైనాన్స్, ఆల్ట్రాటెక్ సిమెంట్స్, ఆదానీ పోర్ట్స్, దివిస్ ల్యాబ్ షేర్లు లాభపడ్డాయి.
నష్టపోయిన షేర్లు..
కోల్ ఇండియా, శ్రీ సిమెంట్, హెచ్‌డీఎఫ్‌సీ, నెస్లే ఇండియా, బజాజ్ ఫిన్‌సర్వ్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఎం అండ్ ఎం, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, హిందూస్థాన్ యూనిలీవర్, సన్ ఫార్మా షేర్లు నష్టపోయాయి.