Friday, November 22, 2024

Market Crash – బేర్ మ‌న్న స్టాక్ మార్కెట్ – 16వంద‌ల పాయింట్లు న‌ష్ట‌పోయిన సెన్సెక్స్

ముంబై – దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీగా పతనమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూలతలు, బ్లూచిప్ కంపెనీల షేర్లలో అమ్మకాలు మార్కెట్లను కుప్పకూల్చాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ ఏకంగా 1,628 పాయింట్లు నష్టపోయి 71,500కి పడిపోయింది. నిఫ్టీ 460 పాయింట్లు కోల్పోయి 21,571కి దిగజారింది.

సెన్సెక్స్ అండ్ నిఫ్టీ రెండూ కూడా నేడు నష్టాల్లోనే ముగియ‌డంతో మ‌దుప‌రులు భారీగా న‌ష్ట‌పోయారు.

టాప్ గెయినర్స్ జాబితాలో HCL టెక్నాలజీస్, SBI లైఫ్ ఇన్సూరెన్స్, ఇన్ఫోసిస్, ఎల్ అండ్ టి టెక్నాలజీ, ఒరాకిల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సాఫ్ట్‌వేర్ లిమిటెడ్, బిర్లాసాఫ్ట్ లిమిటెడ్, పాలిక్యాబ్ ఇండియా లిమిటెడ్ మొదలైన కంపెనీలు ఉన్నాయ.

HDFC బ్యాంక్, టాటా స్టీల్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఇండియన్ ఎనర్జీ ఎక్స్ఛేంజ్ లిమిటెడ్, యాక్సిస్ బ్యాంక్, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్, వోడాఫోన్ ఐడియా మొదలైన కంపెనీలు నష్టాలను చవి చూశాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement