Tuesday, November 26, 2024

కంపెనీలపై మార్జిన్‌ ఒత్తిడి, పెరుగుతున్న ముడి సరుకుల ధరలు..

సిమెంట్‌ నుండి ఎఫ్‌ఎంసీజీ వరకు అన్ని రంగాలు, దాదాపు అన్ని కంపెనీలు కూడా మార్జిన్‌ ఒత్తిడిలో ఉన్నాయి. కంపెనీలు తమ ఉత్పత్తుల ధరలు పెంచినప్పటికీ.. అంతకంతకూ పెరుగుతున్న ముడి సరుకు పెరుగుదల, ఇంధన ధరల పెరుగుదల లాభాలపై ప్రభావం చూపుతోంది. వాస్తవానికి ఇటీవలి కంపెనీలు ఫలితాలు ప్రకటిస్తున్న సమయానికి నిర్వహణ ఖర్చు భారం కాస్త తగ్గినప్పటికీ.. చాలా కంపెనీల ఫలితాలు మాత్రం ఆశించినంతగా లేవు. దాదాపు 75కు పైగా కంపెనీలు నాలుగో త్రైమాసిక ఫలితాలు ప్రకటించాయి. ఏడాది ప్రాతిపదికన కేవలం 12 శాతం మాత్రమే పెరిగింది. ఆపరేటింగ్‌ మార్జిన్‌ ప్రాఫిట్‌ ఏడాది ప్రాతిపదికన 65 బేసిస్‌ పాయింట్లు తగ్గాయి. ఇది నిర్వహణ లాభంపైన 10 శాతం ప్రభావం చూపింది.

నెస్లే గ్రాస్‌ మార్జిన్‌లో క్షీణత..

నెస్లే స్థూల మార్జిన్‌లలో ఏడాది ప్రాతిపదికన 315 బేసిస్‌ పాయింట్ల మేర క్షీణించింది. ఇది ఎడిబుల్‌ ఆయిల్స్‌, ప్యాకేజింగ్‌ మెటీరియల్స్‌ వంటి కీలక ఉత్పత్తుల ద్రవ్యోల్బణం తీవ్రతను ప్రతిబింబిస్తున్నాయి. ఏడాది ప్రాతిపదికన 10.2 శాతంతో మంచి వృద్ధి కనిపిస్తున్నప్పటికీ.. కంపెనీ నిర్వహణ మార్జిన్‌ మాత్రం ఏడాది ప్రాతిపదికన 200 బేసిస్‌ పాయింట్లు తగ్గి.. 23.2 శాతానికి క్షీణించింది. ఎబిడా ఫ్లాట్గా నిలిచింది. ఏసీసీ సిమెంట్‌ సంస్థ ఆపరేటింగ్‌ మార్జిన్‌ ఏడాది ప్రాతిపదికన 600 బేసిస్‌ పాయింట్లు తగ్గి.. 14.3 శాతానికి తగ్గింది. ప్రతీ టన్నుకు నిర్వహణ ఖర్చులు 13 శాతం పెరిగాయి. ఈ ప్రభావం పడింది. దీంతో కంపెనీ నిర్వహణ లాభం 25 శాతం క్షీణించింది. ఇటీవల సిమెంట్‌ ఉత్పత్తిదారులు ధరలు పెంచుతున్నారు. మార్చి కంటే ఏప్రిల్‌లో 5శాతం నుంచి 6 శాతం పెరుగుదల కనిపించింది. డీజెల్‌, బొగ్గు, పెట్‌ కోక్‌పైన అయ్యే అదనపు ఖర్చు 9 శాతం నుంచి 10 శాతం పెంపు అవసరమని భావిస్తున్నారు.

లక్ష్యాలు అందుకోని టెక్‌ కంపెనీలు..

గత త్రైమాసికంలో టెక్‌ దిగ్గజాలు మాత్రం సానుకూల ఫలితాలను నమోదు చేశాయి. టీసీఎస్‌ 11.3 బిలియన్‌ డాలర్ల ఆర్డర్స్‌ రికార్డుతో అదరగొట్టింది. త్రైమాసికం పరంగా ఎబిటా మార్జిన్‌ మాత్రం 24.96 శాతం వద్ద దాదాపు స్థిరంగా ఉన్నాయి. ఇన్ఫోసిస్‌ అంచనాలు మిస్‌ అయ్యాయి. 27 శాతం అధిక ఆట్రిషన్‌తో సమస్య ఎదుర్కొంటోంది. ఎబిటా మార్జిన్‌ 21.5 శాతంగా ఉంది. మొత్తానికి భారతీయ కంపెనీల ఇటీవలి త్రైమాసిక ఫలితాలను చూస్తుంటే.. మార్జిన్‌ ఒత్తిడిలో ఉన్నట్టు కనిపిస్తున్నాయి.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement