Tuesday, November 12, 2024

భారత్‌లోనే ఇంటెల్ లాప్‌టాప్‌ల తయారీ.. మేకిన్ ఇండియా దిశగా అడుగులు

భారత్‌లోనే లాప్‌టాప్‌ల తయారీ దిశగా ప్రముఖ ల్యాప్‌టాప్ల ఇంటెల్‌ అడుగులు వేస్తోంది. ఇందుకోసం 8 స్థానిక కంపెనీలతో జత కట్టింది. ఈ సంస్థలను అవసరమైన సాంకేతిక సాయం చేయనుంది. ఈ ఒప్పందం ప్రకారం.. ఆయా సంస్థలకు ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్ సర్వీసెస్ (ఈఎంఎస్), ఒరిజినల్ డిజైన్ మాన్యుఫాక్చరర్లతో ఎంట్రీ లెవల్ ల్యాప్‌టాప్‌ల తయారీకి అవసరమైన టెక్నాలజీని ‘ఇంటెల్’ షేర్ చేసుకుంటుంది.

అంతే కాకుండా.. ల్యాప్‌టాప్‌ల తయారీలో క్వాలిటీ కంట్రోల్, ప్రొడక్ట్ బెంచ్ మార్క్ కాపాడే విషయంలోనూ అవసరమైన తోడ్పాటును అందిస్తుంది. దీంతో ‘మేకిన్‌ ఇండియా’ ప్రాజెక్టుకు ఇంటెల్ మరింత ఊతమివ్వనుంది. ఇంటెల్ సంస్థతో జత కట్టిన దేశీయ కంపెనీల్లో.. భగవతీ ప్రొడక్ట్స్, డిక్సన్ టెక్నాలజీస్ ఇండియా, కేన్స్ టెక్నాలజీ ఇండియా లిమిటెడ్‌, ఆప్టిమస్ ఎలక్ట్రానిక్స్, పనాచే డిజిటల్ లైఫ్, స్మైల్ ఎలక్ట్రానిక్స్, సిర్మా ఎస్జీఎస్ టెక్నాలజీ, వీవీడీఎన్ టెక్నాలజీ కంపెనీలు ఉన్నాయి.

- Advertisement -

ఇంటెల్ తాజా నిర్ణయం ప్రభుత్వం చేపట్టిన మేక్-ఇన్-ఇండియా ప్లాన్‌కు నెల గ్యాప్‌లో రెండవ ప్రధాన ప్రోత్సాహం కావడం విశేషం. ఇప్పటికే ఆపిల్ కంపెనీ టాటాతో జతకట్టి మేక్‌ ఇన్‌ ఇండియా దిశగా అడుగులు వేస్తోంది. ఇక, గూగుల్ కూడా భారతదేశంలో తన తాజా ఫ్లాగ్‌షిప్ పిక్సెల్ 8 ఫోన్‌ల తయారీని ప్రారంభించే ప్రణాళికలను ప్రకటించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement