ప్రముఖ ఫార్మా కంపెనీ మ్యూన్‌కైండ్ ఫార్మా తొలి పబ్లిక్ ఆఫర్‌కు వస్తోంది. ఈ ఐపిీవో ద్వారా 7,500 కోట్ల మేర నిధులు సేకరించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మేరకు మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీకి మ్యాన్‌కైండ్ ఫార్మా దరఖాస్తు చేసుకుంది. ఫార్మారంగంలో ఇదే అది పెద్ద ఐపీవోగా ఉంటుందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. 2020లో గ్లాండ్ ఫార్మా కంపెనీ 6,480 కోట్లు ఐపీవో ద్వారా సమీకరించింది. ఇప్పటి వరకు ఇదే మోగా ఐపీఓ. ఇప్పుడు మ్యాన్‌కైండ్ ఫార్మా దీనికి మించిన మోగా ఐపీవోకి రానుంది.
ఈ ఐపీవోలో ప్రమోటర్లు, ఇన్వెస్టర్లకు చెందిన 4 కోట్ల ఈక్విటీ షేర్లను ఆఫర్ ఫర్ సేల్ పద్ధతిలో విక్రయించనున్నట్లు మ్యాన్‌కైండ్ తన డ్రాఫ్ట్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్‌లో పేర్కొంది. కంపెనీలో ప్రమోటర్లైన రమేష్ జునేజా, రాజీవ్ జునేజా, షితల్ అరోరాకు చెందిన షేర్లతో పాటు, ఇన్వెస్టర్ల షేర్లు కూడా ఉన్నాయి. ఈ ఐపీవోకు కోటక్ మహింద్రా క్యాపిటల్, యాక్సిస్ క్యాపిటల్, ఐఐఎఫ్‌ఎల్ సెక్యూరిటీస్, జెెఫ్రీస్ ఇండియా, జేపీ మోర్గాన్ ఇండియా లీడ్ మేనేజర్లుగా వ్యవహరించనున్నాయి. ఫార్మా రంగంలో ఉన్న ప్రముఖ కంపెనీల్లో మ్యాన్‌కైండ్ ఫార్మా ఒకటి. కంపెనీకి దేశవ్యాప్తంగా 23 చోట్ల తయారీ కేంద్రాలు ఉన్నాయి.