హైదరాబాద్ : నా పాత్ర మీనాక్షికి మానస శర్మ ఒక సజీవ ఉదాహరణ అని సోనీ లైవ్ రాబోయే షో బెంచ్ లైఫ్ పై నటి రితికా సింగ్ అన్నారు. ప్రతిభావంతులైన నటి రితికా సింగ్ మాట్లాడుతూ… బెంచ్ లైఫ్‌లో తన పాత్ర పరివర్తన తమ దర్శకురాలు మానసా శర్మ నిజ జీవిత కథ అన్నారు. ఆమె తన ముందు ప్రత్యక్ష ఉదాహరణ అన్నారు. ఆమె సాప్ట్వేర్ ఇంజనీర్ నుండి తన స్వంత సిరీస్‌కి దర్శ కత్వం వహించడం చాలా స్ఫూర్తిదాయకంగా ఉందన్నారు. మహిళలు తమ కలలను వెంబడించడం, వారి హృదయం వారిని ఎక్కడికి తీసుకువెళుతుందో దానికి పూర్తిగా కట్టుబడి ఉండటం ద్వారా తమ అభిరుచిని సజీవంగా ఉంచుకోవడం తనకు చాలా సంతోషాన్నిస్తుందన్నారు.
సామాజిక నిబంధనలు, అంచనాలను ధిక్కరించడానికి, నిజంగా వారు ఉండాలనుకుంటున్నట్లుగా ఉండటానికి ఎంతో ధైర్యం కావాలన్నారు. బెంచ్ లైఫ్‌లో ఆ పాత్రను పోషించినందుకు తాను చాలా సంతోషించానన్నారు. సోనీ లైవ్ లో బెంచ్ లైఫ్ కు మానస శర్మ దర్శకత్వం వహించారు. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ పతాకంపై నిహారిక కొణిదెల దీన్ని నిర్మించారు. వైభవ్ రెడ్డి, రితికా సింగ్, ఆకాంక్ష సింగ్, చరణ్ పేరి, ప్రముఖ నటులు రాజేంద్ర ప్రసాద్, తులసి, తనికెళ్ల భరణి వంటి భారీ తారాగణాన్ని కలిగి ఉన్న బెంచ్ లైఫ్ పరిస్థితులను తట్టు-కోవడం, ఆనందాన్ని అనుసరించడాన్ని దృశ్యరూపంలో అందిస్తుంది. దీనికి పి.కె దండి సంగీతం అందించారు. సినిమాటోగ్రఫీ దనుష్ భాస్కర్. ఇప్పుడు సోనీ లైవ్ లో మాత్రమే బెంచ్ లైఫ్ స్ట్రీమింగ్‌ను ఆస్వాదించడానికి సిద్ధంగా ఉండండి.