హైదరాబాద్, (ప్రభ న్యూస్) : ఇండియా అగ్రగామి ఆన్‌లైన్ ట్రావెల్ కంపెనీ అయిన మేక్‌మైట్రిప్ లిమిటెడ్, ప్రయాణికులు మేక్‌మైట్రిప్ అదేవిధంగా గోయ్ బిబో యాప్ ద్వారా ప్రయాణాన్ని (విమానాలు లేదా హోటళ్ళు) బుక్ చేసుకునేటప్పుడు బుక్ నౌ పే లేటర్ (బీఎన్ పీఎల్) చెల్లింపు ఆప్షన్ ప్రవేశపెడుతూ, భారతీయులు తమ ప్రయాణాలకు ఎలా చెల్లింపు చేస్తారో దానికి కొత్త రూపాన్ని ఇస్తోంది.
ఈసందర్భంగా మేక్‌మై ట్రిప్ సహ-వ్యవస్థాపకులు, గ్రూప్ సీఈఓ రాజేష్ మాగోవ్ మాట్లాడుతూ… అనేక సంవత్సరాలుగా, ఇండియాలోని కస్టమర్లకు ప్రయాణ అనుభవాలను పునర్నిర్వచించడంలో మేక్‌మై ట్రిప్ కీలక పాత్రను పోషించిందన్నారు. తమ కస్టమర్లు ఆకర్షణీయమైన షరతులపై స్వల్పావధి అరువును సులభంగా, త్వరితంగా ప్రాప్యత చేసుకోవడానికి బీఎన్ పీఎల్, ఇఎంఐ ఆప్షన్లు సహాయపడుతున్నాయన్నారు. ఇది ప్రయాణికులు మరింత తరచుగా, కొత్త ప్రదేశాలకు ప్రయాణించాలనే తమ ఆకాంక్షలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుందన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..