విద్యుత్ వాహనాలకు ఛార్జింగ్ మౌలిక సదుపాయల కల్పించే ఛార్జ్ ప్లస్ జోన్‌తో ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ మహీంద్రా అండ్ మహీంద్రా అవగాహన ఒప్పందం చేసుకుంది. మహీంద్రా త్వరలో తీసుకురానున్న విద్యుత్ ఎస్‌యూవీల కోసం ఛార్జింగ్ నెట్‌వర్క్ ఏర్పాటు చేసేందుకు ఈ భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు ప్రకటించాయి. వివిధ ప్రాంతాల్లో డీసీ ఫాస్ట్ ఛార్జర్ల ఏర్పాటు, నిర్వహణ చేపట్టనున్నట్లు రెండు కంపెనీలు సంయుక్త ప్రకటనలో తెలిపాయి. ఈ ఛార్జర్లను తమ కంపెనీ ఫోర్ వీలర్స్‌తో పాటు, పబ్లిక్‌కు కూడా అందుబాటులో ఉంచుతామని మహీంద్ర అండ్ మహీంద్రా కంపెనీ తెలిపింది. ఇప్పటికే దేశంలోని పలు ప్రాంతాల్లో 650 ఛార్జింగ్ కేంద్రాల్లో 1450 ఛార్జింగ్ పాయింట్లను, ఛార్జర్ ప్లస్ జోన్ అందుబాటులొ ఉంచింది.
రోజుకు 5 వే వాహనాలకు ఛార్జింగ్ సదుపాయం కల్పిస్తున్నట్లు తెలిపింది. మహీంద్రా కంపెనీ నుంచి తొలి విద్యుత్ కారు 2024లో మార్కెట్‌లోకి రానుంది. కంపెనీ వరసగా 10 విద్యుత్ కార్లను మార్కెట్‌లోకి తీసుకు వస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. ఇందు కోసం బ్రిటన్‌కు చెందిన ఒక కంపెనీతో మహీంద్రా అండ్ మహీంద్రా ఒప్పందం చేసుకుంది. ఎక్స్‌యూవీ 400 ఎస్‌యూవీ కారును మొదట మార్కెట్‌లోకి తీసుకు రానుంది.