దేశంలో ఎస్యూవీ విభాగంలో అగ్రగామి సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా సరికొత్త ఎక్స్‌యూ వీ 300 టర్బో స్పోర్ట్ సిరీస్‌ను విడుదల చేసింది. కొత్త 1.2 లీటర్ ఎం స్టాలియన్ టీజీడీఐ ఇంజిన్ కలిగిన మొదటి ఎస్యూవీ ఇది. ఇందులో 250 ఎన్ఎం టార్క్‌ను అందించగలిగే ఓవర్ బూస్ట్ సామర్ధ్యం ఉంది. ఈ కొత్త కారు ప్రారంభ ధర 10.35 లక్షలు. జీరో నుంచి 60 కిలోమీటర్ల వేగాన్ని కేవలం 5 సెకన్లలో అందుకుంటుం దని కంపెనీ తెలిపింది.
ఇందులో పూర్తి బ్లాక్ ఇంటీరియర్స్, లెదర్ సీట్లు, క్రోమ్ ఫినీష్ పెడల్స్, డ్యూయల్ టోన్ ఎక్స్టీరియర్స్ ఉన్నాయి. ఇది నాలుగు ఆకర్షణీయమైన రంగుల్లో లభిస్తుంది. టాప్ఎండ్ కారు 15 లక్షల లోపు లభిస్తుందని కంపెనీ తెలిపింది. నూతన స్టోర్ట్ సిరీస్‌లో అత్యంత శక్తివంతమైన టీజీడీఐ పవర్ట్రైన్ దీనిలో ఉందని కంపెనీ ప్రొడక్ట్ డెవలప్మెంట్ అధ్యక్షులు ఆర్ వేలు స్వామి చెప్పారు. ఈ కొత్త ఎక్స్‌యూవీ 300 ఈ నెల 10 నుంచి టెస్ట్ డ్రైవింగ్ కోసం అందుబాటులో ఉంటుంది. అప్పటి నుంచే బుకింగ్స్ కూడా ప్రారంభం అవుతాయని కంపెనీ తెలిపింది.