Friday, September 6, 2024

HYD: డిజైన్ ఇన్నోవేషన్ నూతన కోర్సును ప్రారంభించిన మహీంద్రా యూనివర్సిటీ

సోమాజిగూడ : విద్యార్థుల్లో ఉన్న సృజనాత్మక శక్తి, నైపుణ్యానికి ప్రాముఖ్యతనిస్తూ “డిజైన్ ఇన్నోవేషన్” నూతన కోర్సును మహీంద్రా విశ్వవిద్యాలయం ప్రారంభించింది. ఈ మేరకు బేగంపేటలోని ఓ ప్రైవేటు హోటల్లో నిర్వహించిన సమావేశంలో నూతన కోర్సుకు సంబంధించిన పోస్టర్ ను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా మహీంద్రా యూనివర్సిటీ వైస్ చాన్సలర్ యాజులు మేడూరి, ఇన్నోవేషన్స్ వ్యవస్థాపక డీన్ ప్రొ.బీ కే చక్రవర్తి మాట్లాడుతూ… స్కెచ్చింగ్, నాట్యం, నటన, డిజైనింగ్ వంటి వాటిలో ఆసక్తి, నైపుణ్యం ఉన్న వారు పూర్థి స్థాయిలో ఎదిగేందుకు సరైన కోర్సులు అందించాలానే సదుద్దేశంతో ఈకోర్సులను ప్రారంభించామన్నారు. విద్యార్థులు ఇష్టాలు, నైపుణ్యాలకు అనుగుణంగా వారిని ప్రొఫెషనల్స్ గా తీర్చిదిద్దడమే తమ ప్రధాన ఉద్దేశమన్నారు. విద్యార్థులను ప్రొఫెషన్ గా మార్చి వారికీ మంచి భవిష్యత్ కు బాటలు వేసే వినూత్న కార్యక్రమం అన్నారు.

- Advertisement -

ఆగస్టు 15, 2024 నుండి బ్యాచిలర్స్ ప్రోగ్రామ్ ఇన్ డిజైన్ కోర్స్ ప్రారంభమవుతుందన్నారు. ఇంటర్ పూర్తి చేసి డిజైన్, స్కెచ్చింగ్ పైన మక్కువ కలిగిన వారు ఈ కోర్సుల్లో చేరాలన్నారు. ఇలాంటి నూతన అవకాశాన్ని సద్వినియోగంచేసుకోవాలని సూచించారు. 4సంవత్సరాల కోర్సుకు గాను ప్రతి సంవత్సరం ట్యూషన్ ఫీజు గా 4లక్షలు ఉంటుందన్నారు. మొదటి బ్యాచ్ కు 25% ఛాన్సలర్ స్కాలర్ షిప్ అందించనున్నట్లు వీసీ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement