Sunday, November 24, 2024

Mahindra | కొత్త ప్రీఓన్డ్‌ కార్‌ స్టోర్‌ను ప్రారంభించిన మహీంద్రా ఫస్ట్‌ ఛాయిస్‌ కార్‌ అండ్‌ బైక్‌

హైదరాబాద్‌, (ఆంధ్రప్రభ) : మహీంద్రా ఫస్ట్‌ ఛాయిస్‌ మద్దతు కలిగిన ఆటో కంటెంట్‌, కామర్స్‌ పోర్టల్‌ కార్‌ అండ్‌ బైక్‌ ఇటీవల యూజ్డ్‌ కార్‌ స్టోర్‌ కార్‌అండ్‌ బైక్‌ సెలెక్ట్‌ను వీవీసీ మోటార్స్‌ భాగస్వామ్యంతో హైదరాబాద్‌లోని ఆటోనగర్‌లో ప్రారంభించింది. ఈ స్టోర్‌ కస్టమర్లు ఎంచుకోవడానికి అనేక రకాల సర్టిఫైడ్‌ ప్రీఓన్డ్‌ కార్లను అందిస్తుంది. కస్టమర్లు గ్యారెంటీ బై బ్యాక్‌ని ఇక్కడ పొందవచ్చు.

ఈ సందర్భంగా మహీంద్రా ఫస్ట్‌ ఛాయిస్‌ వీల్స్‌ లిమిటెడ్‌ ఎండీ అండ్‌ సీఈవొ మహమ్మద్‌ తుర్రా మాట్లాడుతూ.. కొత్తగా తెరిచిన స్టోర్‌ కార్‌ కొనుగోలు ప్రయాణంలో అత్యుత్తమ ప్రీఓన్డ్‌ కార్‌ కొనుగోలు అనుభవాన్ని అందిస్తుంది. తమ ఆన్‌లైన్‌ పోర్టల్‌, నిశితంగా తనిఖీ చేయబడిన వాహనాలు, నిపుణుల మార్గదర్శకత్వం, స్వాగతించే షోరూమ్‌లు ద్వారా ఈ ప్రయాణంలో వినియోగదారునికి అవసరమైన సహాయాన్ని అందిస్తాయని తెలిపారు.

డీలర్‌ ప్రిన్సిపల్‌, వీవీసీ గ్రూప్‌ చైర్మన్‌ వీవీ.రాజేంద్ర ప్రసాద్‌ మాట్లాడుతూ హైదరాబాద్‌లో మహీంద్రా ఫస్ట్‌ ఛాయిస్‌ మొదటి కార్‌ అండ్‌ బైక్‌ సెలెక్ట్‌ యూజ్డ్‌ కార్‌ స్టోర్‌ కార్‌ అండ్‌ బైక్‌తో భాగస్వామ్యం చేసుకున్నందుకు సంతోషిస్తున్నామని, అత్యున్నత కస్టమర్‌ అనుభవం, కఠినమైన తనిఖీ ప్రక్రియ ద్వారా తమ స్టోర్‌ నుండి అత్యుత్తమ కార్లు మాత్రమే విక్రయించబడతాయని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement