న్యూఢిల్లి : భారతదేశంలోనే నెంబర్ వన్ ఎలక్ట్రిక్ 3 వీలర్ కంపెనీగా మహీంద్రా ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్ (ఎంఈఎంఎల్) ఘనత సాధించింది. ఢిల్లికి చెందిన స్టార్టప్ కంపెనీ టెర్రాగో లాజిస్టిక్స్‌తో కీలక ఒప్పందం చేసుకున్నట్టు ఎంఈఎంఎల్ బుధవారం ప్రకటించింది. టెర్రాగో ప్రస్తుతం.. ఆన్‌లైన్ గ్రాసరీ దిగ్గజం బిగ్ బాస్కెట్‌తో 3 నగరాల్లో సేవలు అందిస్తున్నది. లాజిస్టిక్ దిగ్గజం పోర్టర్‌తో 65 మహీంద్రా ట్రియో జోర్ కార్గో వాహనాలను కలిగి ఉంది. రాబోయే నెలల్లో మరిన్ని మహీంద్రా ఎలక్ట్రిక్ వాహనాలతో సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నట్టు టెర్రాగో లాజిస్టిక్స్ తెలిపింది. కాలుష్య రహిత వాతావరణమే తమ లక్ష్యమని వివరించింది. 2020లో మహీంద్రా త్రీ వీలర్ భారత్లో మహీంద్రా ప్రవేశపెట్టింది. ఈ సందర్భంగా మహీంద్రా ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్ సీఈఓ సుమన్ మిశ్రా మాట్లాడుతూ.. మహీంద్రా ట్రియో జోర్ ఎలక్ట్రిక్ 3 వీలర్‌లో ముందుగా ముందుగా టెర్రాగో ఒకటి.
ట్రియోజోర్ అత్యధిక పొదుపు, జీరో టెయిల్‌పైప్ ఉద్గారాలు సమర్థవంతమైన, స్థిరమైన సేవలను అందిస్తున్నది. కార్బన ఉద్గారాలను తగ్గించడమే కంపెనీ లక్ష్యంగా తెలిపారు. ఇతరులు ఎలక్ట్రిక్ మొబిలిటీని స్వీకరించేందుకు దోహదం చేస్తుందని వివరించారు. టెర్రాగో లాజిస్టిక్స్ సహ వ్యవస్థాపకుడు మోహన్ రామ స్వామి మాట్లాడుతూ.. మహీంద్రా ట్రియో జోర్‌తో కార్గో మొబిలిటీ కోసం ఎలక్ట్రిక్ 3 వీలర్‌లను స్వీకరించడంలో భారత్ అగ్రగామిగా ఉందన్నారు. ఈ విషయమై ఎంతో గర్వంగా ఉందని తెలిపారు. డెలివరీలకు క్లీన్ మొబిలిటీ సేవలు పొందుతున్నామని వివరించారు. దేశంలో కర్బన ఉద్గారాలను తగ్గించడంలో తమ వంతు పాత్ర పోషిస్తున్నామని చెప్పుకొచ్చారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..