Friday, November 22, 2024

మహీంద్రా ఎర్త్‌ మాస్టర్, తక్కువ ఇంధనం.. ఎక్కువ పని

న్యూఢిల్లి : మహీంద్రా గ్రూప్‌లో భాగమైన మహీంద్రా కన్‌స్ట్రక్షన్‌ ఎక్విప్‌మెంట్‌ డివిజన్‌ (ఎంసీఈ) మంగళవారం ఓ సరికొత్త నినాదాన్ని తెరపైకి తీసుకొచ్చింది. లీటర్‌కు అత్యధిక ఉత్పాదకత లేదంటే మెషిన్‌ తిరిగి ఇచ్చేయండి.. అనే గ్యారెంటీ స్కీంను తమ బీఎస్‌ 4 శ్రేణి బ్లాక్‌హో లోడర్స్‌-మహీంద్రా ఎర్త్‌ మాస్టర్‌ కోసం అందిస్తున్నది. ఈ నూతన శ్రేణిలో నిరూపితమైన, ఆధారపడతగిన 74 హెచ్‌పీ సీఆర్‌ఐ మహీంద్రా ఇంజిన్‌, మరెన్నో ఇతర సాంకేతిక ఆవిష్కరణలు ఉన్నాయి. వీటితో పాటు విప్లవాత్మక ఐమ్యాక్స్‌ టెలిమ్యాట్రిక్స్‌ సొల్యూషన్స్‌ కూడా ఉండటంతో మెరుగైన ఇంధన సామర్థ్యంకు హామీ ఇస్తుంది. నిర్వహణ ఖర్చులో అత్యధిక మొత్తం (దాదాపు 50శాతం) ఇంధన ఖర్చులే అవుతుంటాయి. వినూత్నమైన ఫీచర్లు కలిగిన బనానా బూమ్‌, జాయ్‌ స్టిక్‌ లీవర్‌, విస్తృత శ్రేణి డిజైన్‌, పెద్దవైన బకెట్స్‌ కలిగిన ఎర్త్‌ మాస్టర్‌ శ్రేణి అన్ని రకాల బ్యాక్‌ హో అప్లికేషన్‌లకూ అనుకూలంగా ఉంటాయి.

మహీంద్రా అండ్‌ మహీంద్రా లిమిటెడ్‌ కమర్షియల్‌ వెహికిల్స్‌ బిజినెస్‌ యూనిట్‌ హెడ్‌ జలాల్‌ గుప్తా మాట్లాడుతూ.. గ్యారెంటీగా అత్యధిక లీటర్‌ ఉత్పాదకత ఇస్తుందని, నిర్మాణ రంగ పరిశ్రమలో ఓ ప్రతిష్టాత్మక మైలురాయిగా నిలుస్తుందన్నారు. వేగంగా పెరుగుతున్న ఇంధన ధరల నేపథ్యంలో దీన్ని తీసుకొచ్చామని వివరించారు. బీఎస్‌ 4 మెషిన్లు అత్యధిక ఇంధన సామర్థ్యం అందిస్తాయని, ఇది భారతీయ వినియోగదారులను అర్థం చేసుకున్న తరువాతే కంపెనీ అత్యున్నత సాంకేతిక వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చిందన్నారు. అత్యాధునిక ఐమ్యాక్స్‌ టెలిమాటిక్స్‌ సాంకేతికత సాయం తీసుకున్నట్టు వివరించారు

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement